మిమ్మ‌ల్ని తీసుకెళ్తే మా ఆవిడ ఊరుకోదు: ఫ్యాన్‌తో హీరో చిట్‌చాట్

బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ స‌ర‌దాగా అభిమానుల‌తో ట్విట‌ర్‌లో చాట్ చేసారు. ఆయ‌న ప్ర‌ధా పాత్ర‌లో న‌టించిన సినిమా భోళా. ఈ సినిమాను 30న విడుద‌ల చేస్తున్నారు. ఇందులో అజ‌య్‌..ఎవ‌ర్‌గ్రీన్ బ్యూటీ ట‌బుతో క‌లిసి న‌టించారు. ఈ నేప‌థ్యంలో సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా.. అజ‌య్ ట్విట‌ర్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చ‌టించారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ ఆయ‌న్ని ఏమ‌డిగారో.. దానికి ఆయ‌న ఏమ‌ని బ‌దులిచ్చారో చూసేయండి.

స‌ర్‌.. భోళా సినిమాకు మీతో పాటు న‌న్ను తీసుకెళ్ల‌చ్చుగా?
మిమ్మ‌ల్ని తీసుకెళ్తే మా ఆవిడ ఊరుకోదుగా

మీ అబ్బాయి యుగ్‌ని ఎప్పుడు బాలీవుడ్‌లో లాంచ్ చేస్తున్నారు?
లాంచ్ సంగ‌తి తెలీదు కానీ స‌రైన టైంకి లంచ్ చేస్తున్నాడు. అది చాలు ఇప్ప‌టికి.

ఎప్పుడు క‌లుద్దాం స‌ర్?
మార్చి 30న‌.. మీ ద‌గ్గ‌ర్లోని థియేట‌ర్ల‌లో.

చాలా సినిమాల్లో ట‌బుతోనే యాక్ట్ చేస్తున్నారు. ఏంటి స‌ర్ మ్యాట‌ర్?
ఆమె డేట్లు చాలా ఈజీగా దొరుకుతున్నాయ్‌. అందుకే.

భోళా సినిమా ఎన్ని వసూళ్లు రాబ‌డుతుంద‌ని అనుకుంటున్నారు?
వ‌సూళ్ల సంగ‌తి తెలీదు కానీ.. మీ ప్రేమ‌ను మాత్రం బాగానే రాబ‌డుతుంది.

మీకు ఏది క‌ష్టం? యాక్టింగా? డైరెక్ష‌నా?
మీ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇవ్వ‌డం

ఈ వ‌య‌సులొనూ ఇంత ఫిట్‌గా ఎలా ఉంటున్నారు?
నేను ఫుడ్, బుర్ర రెండూ స‌మ‌పాళ్ల‌లో తింటాను (న‌వ్వుతూ)

ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు?
ఫ్రీగా ఉన్న‌ప్పుడు చెప్తాను

స‌ర్ మీరు రిప్లై ఇస్తే నా గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో సినిమాకు వెళ్తా
గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో పాటు ఆమె పేరెంట్స్‌ని కూడా తీసుకెళ్లండి సంబంధం కుదిరిపోతుంది.