Adipurush: ట్రైలర్​ డేట్​ ఫిక్స్​!

Hyderabad: పాన్​ ఇండియాస్టార్​  ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్​ అవెయిటెడ్​ మూవీ ఆదిపురుష్(Adipurush)​. ప్రముఖ ఇతిహాసం రామాయణం(Ramayanam) ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలీవుడ్(Bollywood) దర్శకుడు ఓం రౌత్(Om Raut) రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్​ రాముడిగా, కృతిసనన్(Krithi sanon) సీతగా, సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా నటిస్తున్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఇదివరకే రిలీజైన టీజర్​పై సర్వత్రా విమర్శలు రావడంతో రిలీజ్​ని వాయిదావేసి గ్రాఫిక్స్​పై మరింత వర్క్​ చేస్తోంది చిత్రబృందం.

ఆదిపురుష్ సినిమాను జూన్ 12న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించిన మేకర్స్, ప్రమోషన్స్​ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటికే జై శ్రీరామ్ అనే లిరికల్ సాంగ్, కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేయగా ఇప్పుడు ఆదిపురుష్ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు చిత్రయూనిట్. మే 9న ఈ సినిమా టైలర్​ని రిలీజ్​ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఈ ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్ కు ఏకంగా నెల రోజుల ముందే ట్రైలర్ ని విడుదల చేయడం విశేషం. ఆదిపురుష్ ట్రైలర్ ని ఏకంగా 70 దేశాలలోని పలు థియేటర్లలో లాంచ్ చేయబోతున్నారు. భారతదేశంతో పాటు సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, మయన్మార్, శ్రీలంక, జపాన్‌తో సహా యూఎస్ఏ, కెనడా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆసియా, ఆఫ్రికా, యూకే అండ్ యూరప్, రష్యా, ఈజిప్ట్ దేశాల్లో ట్రైలర్ లాంచింగ్ జరగబోతోంది. ఎన్నో విమర్శలు, వివాదాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలను గ్రాండ్​గా ప్లాన్​ చేస్తున్నారు మేకర్స్​. మరి ఈ ట్రైలర్​ అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో, టీజర్​లానే నిరాశ పరుస్తుందో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే!