Adipurush: అదిగో రాఘ‌వ రాముడు..!

Tirupati: ఆదిపురుష్ (adipurush) ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుప‌తిలో అట్ట‌హాసంగా జ‌రుగుతోంది. రాఘ‌వ రాముడు ప్ర‌భాస్‌ (prabhas).. డైరెక్ట‌ర్ ఓం రౌత్‌తో క‌లిసి ఎంట్రీ ఇచ్చారు. ప్ర‌భాస్‌ని చూడ‌గానే ఫ్యాన్స్ అదిగో రాఘ‌వ రాముడు అంటూ కేక‌లు వేసారు. దాదాపు ల‌క్ష‌న్న‌ర‌కు పైగా ఫ్యాన్స్ శ్రీ వెంక‌టేశ్వ‌ర గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. వివిధ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హిస్తున్నారు. ఈవెంట్‌కు వ‌చ్చిన ఓ పెద్దాయ‌న ఆదిపురుష్ సినిమా గురించి మాట్లాడుతూ.. రామ‌య్య అంటే ఆరడుగుల ఆజానుబాహుడు గుర్తొస్తాడ‌ని, ఆ క్యారెక్ట‌ర్‌లో ప్ర‌భాస్‌ని త‌ప్ప ఇంకెవ్వ‌రినీ ఊహించుకోలేమ‌ని చెప్ప‌డం హైలైట్‌గా నిలిచింది.