ఆదిపురుష్ పోస్ట‌ర్.. రామయ్య‌గా ప్ర‌భాస్ లుక్ అదుర్స్!

యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో తెర‌కెక్కుతున్న చిత్రం ఆదిపురుష్‌. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నేడు శ్రీరామన‌వ‌మి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని చిత్ర‌బృందం పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. రామ‌య్య‌గా ప్ర‌భాస్‌.. సీత‌మ్మ‌త‌ల్లిగా కృతిస‌న‌న్ చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు స‌న్నీ సింగ్ ల‌క్ష్మ‌ణుడి పాత్ర‌లో, దేవ‌ద‌త్త నగే ఆంజ‌నేయుడి పాత్ర‌లో న‌టిస్తున్నారు. పోస్ట‌ర్ చూస్తుంటే నిజంగానే సీతారామయ్య‌ల‌ను చూస్తున్న‌ట్లుగా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇందులో రావ‌ణాసురుడి పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్ న‌టిస్తున్నారు. జూన్ 16న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.