హీరోయిన్‌తో డేటింగ్.. AAP ఎంపీ ముసి ముసి న‌వ్వులు

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా.. బాలీవుడ్ బ్యూటీ ప‌రిణీతి చోప్రా డేటింగ్‌లో ఉన్నారా? అవున‌నే అంటున్నాయి బాలీవుడ్ వ‌ర్గాలు. కొద్ది రోజులుగా వీరిద్ద‌రూ క‌లిసి డిన్న‌ర్ల‌కు, పార్టీల‌కు వెళ్తున్నారు. ఇదే విష‌యం గురించి బాలీవుడ్ వ‌ర్గాలు రాఘ‌వ్‌ను ప్ర‌శ్నించ‌గా.. “మీరు న‌న్ను రాజ‌నీతి గురించి అడిగితే చెప్తాను కానీ ప‌రిణీతి గురించి కాదు” అన్నారు. ఆ త‌ర్వాత కూడా ప‌లువురు ఫొటోగ్రాఫ‌ర్లు “కానీ ఎవ‌రైతే ప‌రిణీతి గురించి అడుగుతున్నారో వారికి ఏమ‌ని స‌మాధానం చెప్తారు” అని గుచ్చి గుచ్చి అడ‌గ్గా.. “త్వ‌ర‌లో జ‌వాబు చెప్తాను” అంటూ సిగ్గుప‌డుతూ వెళ్లిపోయారు. దాంతో ఈ వీడియో కాస్తా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా సోద‌రి అయిన ప‌రిణీతి బాలీవుడ్‌లో ప‌లు చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవ‌ల రిలీజ్ అయిన ఊంచాయి సినిమాలో క‌నిపించారు. త్వ‌ర‌లో ఆమె నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి.