దేవుడా.. ఇలాంటి గ‌ర్ల్‌ఫ్రెండ్ కూడా ఉంటుందా?

ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు ఆ మ‌నిషి మ‌న సొంతం మ‌న‌కు మాత్ర‌మే సొంతం అనిపిస్తుంది. అబ్బాయి వేరే అమ్మాయికేసి చూసినా.. అదే అమ్మాయి వేరే అబ్బాయి గురించి ఆలోచించినా అవ‌త‌లి వ్య‌క్తి అస్స‌లు త‌ట్టుకోలేరు. కానీ ఒక అమ్మాయి జీవితంలో మాత్రం వింత ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఆ అమ్మాయి త‌న పేరు, వివ‌రాలు వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల చెప్ప‌లేదు కానీ త‌న బాయ్‌ఫ్రెండ్ కోసం తాను ఏం చేసిందో రెడిట్‌లో పోస్ట్ చేసింది.

ఆ అమ్మాయికి ఓ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడ‌ట‌. కానీ అత‌నికి త‌న ప‌ర్స‌నాలిటీ విష‌యంలో అస‌లు కాన్ఫిడెన్స్ లేద‌ట‌. ఎప్పుడు చూసినా న‌న్ను వేరే అమ్మాయిలు ఎందుకు చూస్తారు? అయినా నేను నీకు మాత్ర‌మే న‌చ్చాను అని ఆ అమ్మాయితో అంటుండేవాడ‌ట‌. దాంతో ఎలాగైనా అతనిలో కాన్ఫిడెన్స్ నింపాల‌నుకుంది పాపం ఆ అమ్మాయి. కానీ అది త‌న‌కే బెడిసికొడుతుంద‌ని మాత్రం అస్స‌లు ఊహించ‌లేక‌పోయింది. ఆ అబ్బాయి పేరుతో ప్ర‌ముఖ డేటింగ్ యాప్ టిండ‌ర్‌లో ఓ అకౌంట్ క్రియేట్ చేసి ఫొటోలు కూడా పెట్టింది. కొంద‌రు అమ్మాయిల ఫొటోల‌ను తనే సెలెక్ట్ చేసింది. దాంతో ఆ అమ్మాయిలు ఈ అబ్బాయి లైక్స్‌ని యాక్సెప్ట్ చేసి మ్యాచ్ అయ్యారు. ఇంతవ‌ర‌కు బాగానే ఉంది. కానీ కొన్ని రోజుల త‌ర్వాత ఆ అబ్బాయి ఖాతాను చెక్ చేస్తే అత‌ను చాలా మంది అమ్మాయిల‌తో ఒకేసారి లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడ‌టం చూసి షాకైంది. ఇదేంటి అని ఎదురుతిరిగింది. అదంతా స‌ర‌దాగా చాట్ చేసాను, సీరియ‌స్ విష‌యం ఏమీ లేదు అని అత‌ను చెప్పాడు. అయినా త‌న‌ని తానే మోసం చేసుకుంది అని అస‌లు విష‌యం అర్థం చేసుకుని ఫైన‌ల్‌గా అత‌నితో బ్రేక‌ప్ చేసుకుంది. కాబ‌ట్టి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇలాంటి విష‌యాల్లో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని స‌ల‌హా ఇస్తోంది.