రోజుకి 10 సార్లు సెక్స్ కావాలట.. పోలీసులకు మహిళ ఫిర్యాదు
Viral News: పోలీసులకు వింత సమస్య ఎదురైంది. ఓ మహిళ తన భర్త రోజుకు పది సార్లు సెక్స్ చేయాలని టార్చర్ పెడుతున్నాడంటూ పోలీసులకు చెప్పుకుని విలపించింది. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. పూర్నియా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భార్య నగలు తీసుకుని పుట్టింటికి పారిపోయిందని ఫిర్యాదు చేసాడు. దాంతో పోలీసులు అతని భార్యను స్టేషన్‌కు పిలిపించారు. ఆమె వెళ్లాక తెలిసింది ఏంటంటే.. అసలు సమస్య నగల గురించి కాదని.
తాను నగలు తీసుకెళ్లిన మాట నిజమే కానీ అవి పెళ్లి సమయంలో తన తండ్రి పెట్టిన నగలని ఆ మహిళ పోలీసులకు చెప్పింది. అంతేకాదు.. ఆ నగల్లో ఒక్కో నగను తీసుకుని అమ్మేసి ఆ డబ్బును కట్నం డిమాండ్ చేస్తున్న తన తండ్రికి ఇచ్చేవాడని పేర్కొంది. అసలు సమస్యంతా నగల గురించి కాదని రోజుకు పది సార్లు సెక్స్ కావాలని అడుగుతున్నాడని ఆ పోరు పడలేక తాను పారిపోయానని చెప్పింది. ఇవన్నీ విన్న ఆ భర్త తన వాదనను వినిపిస్తూ.. అసలు తన భార్య తనను ముట్టుకోనివ్వడం లేదని.. దీనిని బట్టి చూస్తే తనకు వేరొకరితో అక్రమ సంబంధం ఉందని అనుమానంగా ఉందని అన్నాడు. దాంతో పోలీసులు వారిద్దరినీ కౌన్సిలింగ్ సెషన్‌కు పంపించారు. ఎంత కౌన్సిలింగ్ ఇప్పించినా తనకు విడాకులు కావాలని సదరు మహిళ పట్టుబట్టడంతో వారిని విడాకులకు దరఖాస్తు చేసుకునేందుకు పంపించారు.