పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థి.. అంతలోనే తండ్రి మరణ వార్త!

రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులతో సందడి నెలకొంది. ఏపీలో ఒక్క నిమిషం నిబంధన ఉండటంతో పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు పరుగులు పెట్టారు. అటు తెలంగాణలో పరీక్ష మొదలైన అయిదు నిమిషాల వరకూ అనుమతి ఉండటంతో ఆలస్యంగా వచ్చినా అధికారులు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. అయితే, పదో తరగతి పరీక్షల వేళ.. ఓ విషాద ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. పరీక్ష రాసేందుకు ఓ విద్యార్థి పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి ఎగ్జామ్‌ రాసేందుకు వచ్చాడు. పరీక్షకు వస్తున్న సమయంలో ఆ విద్యార్థి తండ్రి చనిపోయినట్లు అతనకి సమాచారం అందింది. అయినప్పటికీ ఆ బాధను దిగమింగుకుని.. పరీక్ష రాశాడు. ఈ ఘటన తెలంగాణలోని నిర్మల్‌ జిల్లా కడెం మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

అనంతరపురంలో రోడ్డు ప్రమాదం.
అనంతపురం జిల్లాలోనూ మరో విద్యార్థి పెద్ద ప్రమాదం త్రటిలో తప్పింది..పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని అతి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఇద్దరిని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.