దేశంలోకి కొత్త వైరస్​.. ప్రజల్లో ఆందోళన!

కొవిడ్​ మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే దేశాన్ని మరో కొత్త వైరస్‌ వణికిస్తోంది. ఇన్​ఫ్లూయంజా దేశవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్​ సోకిన బాధితుల్లో పూర్తిగా కోవిడ్‌ లక్షణాలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే అందరినీ భయపెడుతున్న విషయం. పోస్ట్‌ కోవిడ్‌ ప్రభావం కారణంగా పిల్లలు, పెద్దలు, వృద్ధులు అని లేకుండా చాలామంది కార్డియాక్‌ అరెస్ట్‌తో కుప్ప కూలుతున్నారు. ఈ సమయంలో విజృంభిస్తున్న ఇన్‌ఫ్లూయంజా వైరస్‌ వేగంగా విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ వైరస్‌ హెచ్‌3ఎన్‌2గా రూపాంతరం చెందిందని ఢిల్లీ ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా తెలిపారు. పండుగల సీజన్‌ నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా వృద్ధులు, ఇప్పటికే వైరస్‌ బారిన పడినవారు జాగ్రత్తగా ఉండాలని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌ అండ్‌ రెస్పిరేటరీ అండ్‌ స్లీప్‌ మెడిసిన్‌ చైర్మన్‌ మరియు డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ తెలిపారు.

లక్షణాలు..
ఇన్‌ఫ్లూఎంజా సోనివారిలో గొంతు నొప్పి, దగ్గు, శరీర నొప్పులు, ముక్కు కారడంతోపాటు జ్వరంగా ఉంటుందని తెలిపారు. వైరస్‌ పరివర్తన చెందడం, దానిపై ప్రజల్లో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. మనకు చాలా సంవత్సరాల క్రితం హెచ్‌1ఎన్‌1 కారణంగా మహమ్మారి వచ్చింది. ఆ వైరస్‌ ఇప్పుడు హెచ్‌3ఎన్‌2గా రూపాంతరం చెందిందని పేర్కొన్నారు. ఇది సాధారణ ఇన్‌ఫ్లూంజా జాతి అయినప్పటికీ కేసులు పెరుగుతన్నాయని లె లిపారు. రోగ నిరోధక శక్తి ఉన్నవారిలో త్వరగా నయం అవుతుందని చెప్పారు. ఒకరి నుంచి ఒకరికి సులభంగా విస్తరిస్తుందని కూడా పేర్కొన్నారు. వైరస్‌ ఏటా రూపాంతరం చెందుతుందని, దీనిని యాంటిజెనిక్‌ డ్రిఫ్ట్‌ అంటామని చెప్పారు.

కేసుల పెరుగుదలకు కారణాలు..
రెండు రకాల కారణాలతో కేసులు పెరుగుతున్నట్లు డాక్టర్‌ రణదీప్‌ గులేరియా తెలిపారు. వాతావరణం మారినప్పుడు ఇ¯Œ ఫ్లుఎంజా వచ్చే అవకాశం ఎక్కువ, సమూహాలుగా ఉండడం మరో కారణం అని చెప్పారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడమే వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు మార్గం అని తెలిపారు. తరచుగా చేతులు కడుక్కోవాలని, భౌతిక దూరం కూడా ఉండాలని వెల్లడించారు. వృద్ధులు కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ వైరస్​ బారిన పడకుండా ఉండేందుకు అందరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు.