MR Bachchan: నేనేదో సొల్లు దెం***** హ‌రీష్ అన్నా

a netizen gives honest review to mr bachchan and then this happens

MR Bachchan: హ‌రీష్ శంక‌ర్ ర‌వితేజ‌తో తీసిన మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌పై సోష‌ల్ మీడియాలో బాగా ట్రోల్స్ పేలాయి. కొంద‌రేమో సినిమా బాగుంది అంటుంటే.. మ‌రికొంద‌రేమో ఈ వ‌య‌సులో ర‌వితేజ అన్న‌కు ఇలాంటి సినిమా అవ‌స‌ర‌మా అంటూ కామెంట్స్ వెల్లువెత్తాయి. అయితే సినిమా రిలీజ్ అయిన రోజు మాత్రం హ‌రీష్ శంక‌ర్ కేవ‌లం సినిమా బాగుంది అని చెప్పివారికి మాత్ర‌మే రిప్లైలు ఇచ్చారు. బాలేదు అన్న‌వారి గురించి అస‌లు ప‌ట్టించుకోలేదు. అదేమంటే నాకు న‌చ్చిన‌ట్లు నేను సినిమా తీసాను.. మీకు న‌చ్చిన‌ట్లు మీరు రివ్యూలు ఇచ్చుకోవ‌చ్చు అన్నారు.

అయితే.. సినిమా రిలీజ్ అయిన రోజు ఒక నెటిజ‌న్ చేసిన కామెంట్ వైర‌ల్ అవుతోంది. ప‌వ‌న్ అనే అల్లు అర్జున్ అభిమాని మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ సినిమా గురించి ఇలా ట్వీట్ చేసాడు. “” ఎలాంటి ఫేక్ రివ్యూల‌ను న‌మ్మ‌కండి. సినిమా చాలా బాగుంది. ఇది ర‌వి తేజ అన్న‌కు మంచి కమ్‌బ్యాక్. హ‌రీష్ అన్నా థ్యాంక్యూ సో మ‌చ్ “” అని ట్వీట్ చేసాడు. దీనికి హ‌రీష్ శంక‌ర్ ఎంతో సంతోషంగా రిప్లై ఇస్తూ.. థ్యాంక్స్ చెప్తున్న ఎమోజీలు పెట్టారు. దీనికి ఆ ప‌వ‌న్ అనే నెటిజ‌న్ రిప్లై ఇస్తూ.. నేనేదో సొల్లు దెం*** రిప్లై ఇస్తావ‌ని అని షాకింగ్ కామెంట్ చేసాడు. దాంతో ఈ ట్వీట్ మీమ్‌గా చ‌క్క‌ర్లు కొడుతోంది.