Viral News: కడుపునొప్పి అని హాస్పిటల్‌కు వెళ్లిన వ్యక్తి.. రిపోర్ట్ చూసి షాక్
Viral News: ఓ 45 ఏళ్ల వ్యక్తి కొంతకాలంగా కడుపునొప్పిగా ఉందని హాస్పిటల్‌కు వెళ్లాడు. అతనికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా షాకింగ్ విషయం బయటపడింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కి చెందిన రాజ్‌గిర్ మిస్త్రీ అనే వ్యక్తి కొంతకాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నాడు. వైద్యులను సంప్రదించగా అతనికి అల్ట్రా సౌండ్ చేసారు. అందులో అతనికి కడుపు భాగంలో హెర్నియా ఉందని అది ఇతర అవయవాలకు తగులుతుండడంతో అలా నొప్పి వస్తోందని వైద్యులు చెప్పారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. హెర్నియాకు శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించుకున్నారు.
అలా సర్జరీ చేస్తున్న సమయంలో వారికి ఓ షాకింగ్ విషయం తెలిసింది. అల్ట్రా సౌండ్‌లో కనిపించింది హెర్నియా కాదట. అది గర్భసంచట. పైగా ఆ గర్భసంచిలో అండాలు కూడా ఉండటంతో వారు కంగుతిన్నారు. అలా గర్భసంచితో ఓ మగాడు పుట్టడం అనేది చాలా అరుదుగా జరిగే ఘటన అని.. అతనికి శరీరం లోపల గర్భసంచి, అండశయాలు ఉన్నా కూడా మగాడి లక్షణాలే ఉండటంతో ఎలాంటి సమస్య లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రాజ్‌గిర్ సర్జరీ నుంచి కోలుకుంటున్నాడు. అయితే.. తనలో గర్భసంచి ఉందన్న విషయం మాత్రం బయట ఎవ్వరికీ చెప్పొద్దని వైద్యులను కోరాడట. ఇందుకు వారు కూడా భరోసా కల్పించడంతో అతను సంతోషంగా ఇంటికి వెళ్లిపోయాడు.