ర‌ఘురామ‌ను జ‌గ‌న్ కొట్ట‌మంటేనే కొట్టాం.. షాకిచ్చిన‌ CID ఏఎస్పీ

a big shock to cid asp vijay pal in raghu rama krishnam raju custodial torture case

Raghu Rama Krishnam Raju:  అప్ప‌టి వైఎస్సార్ కాంగ్రెస్ నేత ర‌ఘురామ కృష్ణంరాజు.. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై వేసిన క‌స్టోడియ‌ల్ టార్చ‌ర్ కేసు విష‌యంలో ఏపీ హైకోర్టులో అప్ప‌టి సీఐడి అద‌న‌పు ఎస్పీ విజ‌య్ పాల్‌కు చుక్కెదురైంది. ఈ కేసులో భాగంగా విజ‌య్ పాల్ మ‌ధ్యంత‌ర‌ బెయిల్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. ఇందుకు హైకోర్టు అనుమ‌తించ‌లేదు. ర‌ఘురామ త‌ర‌ఫు న్యాయ‌వాది సిద్ధార్థ్ లుత్రా ఈ కేసు విష‌యంలో భాగంగా వాదిస్తూ.. త‌న క్లైంట్ ర‌ఘురామ‌పై రాజ‌ద్రోహం కేసు వేసి క‌స్టోడియల్ టార్చ‌ర్ చేసి చంపాల‌ని చూసార‌ని అన్నారు.

మ‌రోప‌క్క విజ‌య్ పాల్ త‌ర‌ఫు న్యాయ‌వాది మాట్లాడుతూ.. నిబంధ‌న‌ల మేర‌కే త‌న క్లైంట్ విజ‌య్ పాల్ ర‌ఘురామ‌ను విచారించాడ‌ని ఎలాంటి క‌స్టోడియ‌ల్ టార్చ‌ర్ జ‌ర‌గ‌లేద‌ని వాదించారు. వాదోప‌వాదాలు విన్న ఏపీ హైకోర్టు సిద్ధార్థ్ లుత్రా వాద‌న‌ల‌నే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని మ‌ధ్యంత‌ర బెయిల్‌ను రిజెక్ట్ చేసారు. ఈ నేప‌థ్యంలో విజ‌య్ పాల్ త‌న లాయ‌ర్‌తో జ‌గ‌న్ చెప్ప‌డం వ‌ల్లే ర‌ఘురామ‌ను టార్చ‌ర్ చేసిన‌ట్లు చెప్పాడ‌ట‌. దాంతో జ‌గ‌న్‌కు ఉచ్చు బిగుస్తోంద‌ని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ కేసులో ఐదుగురు వ్య‌క్తుల‌ను నిందితులుగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ న‌మోదు చేసారు. ఈ నిందితుల్లో జ‌గ‌న్ ఏ1గా ఉన్నార‌ట‌.