Murders: 24 గంటల్లో దేశాన్ని వణికించిన 3 మర్డర్లు
Hyderabad: 24 గంటల్లో భారతదేశంలో చోటుచేసుకున్న మూడు మర్డర్లతో (murders) ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీసులు, చట్టాలు, కోర్టులు ఉన్నాయన్న విషయం మర్చిపోయి కర్కశంగా తయారవుతున్న మనుషుల్ని సాటి మనిషికి వణుకుపుడుతోంది. 24 గంటల్లో జరిగిన ఈ మూడు మర్డర్లలో నిందితులు బాలుడు, యువకుడు, వృద్ధుడు ఉన్నారు. మొదటి మర్డర్ ముంబైలో (mumbai murder) చోటుచేసుకుంది. 56 ఏళ్ల వృద్ధుడు 32 ఏళ్ల సరస్వతి వైద్య అనే యువతిని ముక్కలుగా నరికి కుక్కర్‌లో అవయవాలను ఉడికించాడు. మరికొన్ని అవయవాలను కుక్కలకు విసిరేసాడు. నిందితుడు మనోజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇక రెండో మర్డర్ ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ బాలుడు 14 ఏళ్ల మైనర్ బాలికను రేప్ చేసి మరీ చంపేసాడు. లఖ్‌నౌలోని ఇందిరా నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తక్రోహి ప్రాంతంలో నివసిస్తున్న బాలిక ఇంట్లోకి రాత్రి 1 గంట ప్రాంతంలో చొరబడిన బాలుడు దారుణంగా రేప్ చేసి సుత్తితో తలపై కొట్టి చంపేసాడు. ఇంట్లో నుంచి పారిపోయే ముందు ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించడానికి ఫ్యాన్‌కి బాడీని ఉరేసాడు. బాలుడు ఇంట్లో నుంచి పారిపోతున్నప్పుడు మృతురాలి తల్లి పని ముగించుకుని ఇంటికి వచ్చింది. అతన్ని చూసి పట్టుకోవడానికి యత్నించింది కానీ ఆ బాలుడు తోసేసి పారిపోయాడు.
మూడో హత్య బెంగళూరులో చోటుచేసుకుంది. గోదావరిఖని ప్రాంతానికి చెందిన ఆకాంక్ష అనే అమ్మాయిని తన ప్రియుడు దారుణంగా చంపేసాడు. నిందితుడు దిల్లీకి చెందిన అర్పిత్, ఆకాంక్ష కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య గొడవ జరగడంతో బుధవారం రాత్రి ఆకాంక్ష ఉంటున్న ఫ్లాట్‌కు వెళ్లి గొంతు నులిమి చంపేసాడు. పైగా ఆకాంక్ష ఫ్రెండ్‌కి ఫోన్ చేసి సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తోందని ఒకసారి వెళ్లి చూడాలని రిక్వెస్ట్ చేసాడు. ఆకాంక్ష ఫ్రెండ్ ఫ్లాట్‌కి వెళ్లి చూసేసరికి ఆమె చనిపోయింది. అనుమానంతో పోలీసులు అర్పిత్‌ని అదుపులోకి తీసుకోవడంతో విషయం బయటపడింది.