Donald Trump: ట్రంప్‌పై కాల్పులు జరిపింది 20 ఏళ్ల కుర్రాడు
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై శనివారం కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఆయన సభోలో మాట్లాడుతుండగా.. ఒక బుల్లెట్ ఆయన చెవిని తాకి దూసుకెళ్లింది. చెవి భాగంలో తీవ్ర గాయం అవడంతో వెంటనే ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు. అయితే ట్రంప్‌పై కాల్పులకు పాల్పడింది 20 ఏళ్ల కుర్రాడని FBI నిందితుడి తొలి ఫోటోను రిలీజ్ చేసింది.
నిందితుడి పేరు థామస్ మ్యాథ్యూ క్రూక్స్ అని వెల్లడించారు. థామస్ రెండు రౌండ్ల కాల్పులు జరపగానే అక్కడే ఉన్న పోలీసు అధికారులు అతనిపై కాల్పులు జరిపారు. దాంతో థామస్ అక్కడికక్కడే మృతిచెందాడు. మీటింగ్ జరుగుతున్న ప్రదేశంలో ఓ వ్యక్తి బిల్డింగ్ పైకి ఎక్కి అనుమానాస్పదంగా తిరుగుతండడం తాము గమనించామని.. వెంటనే అధికారులకు సమాచారం అందించామని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.
పెన్సిల్వేనియాకు చెందిన థామస్ బీథెల్ హై స్కూల్ నుంచి 2022లో గ్రాడ్యుయేషన్ పొందాడు. క్లాస్ రూంలో ఎప్పుడూ సైలెంట్‌గా ఉండేవాడని.. ఎవ్వరితోనూ మాట్లాడేవాడు కాదని.. ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాడని తోటి విద్యార్థులు చెప్తున్నారు. నవంబర్ 5న అమెరికాలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో థామస్ తన తొలి ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. ఇంతలో ఇలా ట్రంప్‌పై కాల్పులకు పాల్పడి పోలీసుల చేతిలో హతమయ్యాడు.