షారుక్ ఇంట్లోకి చొర‌బ‌డి..8 గంట‌ల పాటు రూంలోనే!

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఇంట్లోకి దొంగ‌లు చొర‌బడ్డారు. ముంబైలోని షారుక్ నివాస‌మైన మ‌న్న‌త్‌లోకి ఇద్ద‌రు దుండ‌గులు చొర‌బడిన‌ట్లు తెలీడంతో అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసారు. అయితే విచార‌ణ‌లో భాగంగా నిందితులు నోరువిప్పారు. ఉద‌యం 3 గంట‌ల స‌మ‌యంలో ఇంట్లోకి ప్ర‌వేశించిన‌ట్లు నిందితులు తెలిపారు. ఆ త‌ర్వాత భ‌యంతో ఎక్క‌డ దాక్కోవాలో తెలీక షారుక్ మేక‌ప్ రూంలోనే దాదాపు ఎనిమిది గంట‌ల పాటు ఉన్నామ‌ని తెలిపారు. షారుక్ సిబ్బందికి వారు దొరికిన‌ప్పుడు గాయాలు ఉన్నాయ‌ట‌. దాంతో పోలీసుల‌కు అప్ప‌గించే ముందు వారికి ప్ర‌థ‌మ చికిత్స చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. నిందితులు గుజ‌రాత్‌లోని భరూచ్ జిల్లాకు చెందిన షైల్ సలీం ఖాన్, రామ్ స‌ర‌ఫ్ కుష్వాహాగా పోలీసులు గుర్తించారు.

అయితే ఈ ఇద్ద‌రు వ్య‌క్తులు దొంగ‌త‌నం కోసం రాలేదని, షారుక్‌ని క‌ల‌వ‌డానికి వెళ్లార‌ని పోలీసులు చెబుతున్నారు. తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు షారుక్ మేక‌ప్ రూంలో వేచి చూస్తుండ‌గా.. మ‌రుస‌టి రోజు ఉద‌యం 10.30కు షారుక్ సిబ్బందికి దొరికిపోయారు. వారిపై ట్రెస్‌పాసింగ్ కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు ముంబై పోలీసులు తెలిపారు. గ‌తంలోనూ షారుక్ ఇంట్లోకి చొర‌బ‌డేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నించి పోలీసుల‌కు చిక్కారు.