Spy Movies: స్పై సినిమాలకు సై..!

Hyderabad: రొటీన్​కి భిన్నంగా స్పై(Spy) యాక్షన్ ని ట్రై చేస్తున్నారు యంగ్ హీరోలు. స్పై సినిమాలు(Spy Movies) ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అయితే దీనికోసం చాలా హార్డ్​ వర్క్​ చెయ్యాలి. తాజాగా అఖిల్ ఏజెంట్ సినిమా ఫలితంతో స్పై సినిమాలు చేస్తున్న హీరోలంతా ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం రూపొందుతున్న స్పై సినిమాల సంగతులేంటో చూద్దాం..

కార్తికేయ 2, 18 పేజెస్ తో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న నిఖిల్(Nikhil) ‘స్పై’ అనే సినిమాతో రాబోతున్నాడు. గ్యారీ డైరెక్షన్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్పై మూవీ షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది.  నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) సరికొత్త లుక్ లో, సరికొత్త జానర్ లో చేస్తున్న మూవీ డెవిల్. బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా 1940 ల్లో సెన్సేషన్ అయిన స్టోరీతో ఈ మూవీ చేస్తున్నారు.

కెరీర్ లో ఎక్కువగా స్పై థ్రిల్లర్స్ తోనే నిలదొక్కుకున్న అడివి శేష్ ఇప్పుడు గూడచారి 2 తో మరోసారి హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నారు. అందుకే గూడచారికి మించి ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ తో గూడచారి 2తో ఆడియన్స్ కి మెప్పించడానికి సిద్దమవుతున్నాడు.

రౌడీ హీరో విజయ్​ దేవరకొండ(Vijay Deverakonda) కూడా VD12గా ఓ వైవిధ్యమైన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్నట్లు ఓ ప్రీ-లుక్ పోస్టర్‌లో రివీల్ చేశారు. ఇక, మోస్ట్​ అవెయిటెడ్​ కాంబినేషన్ రాజమౌళి(SS Rajamouli), మహేష్​ బాబు(Mahesh Babu) చేయబోతున్న SSMB29 కూడా స్పై థ్రిల్లర్​గానే రానుందని తెలుస్తోంది.
రొటీన్ సినిమాల్ని బ్రేక్ చేసి ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ‘గాండీవధారి అర్జున’గా స్పై మూవీ చేస్తున్నారు మెగా మీరో వరుణ్ తేజ్(Varun Tej)​. ఈ సినిమాతో ఎలా అయినా హిట్ ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తున్నారు.