Subbalakshmi: ప్ర‌ముఖ న‌టి సుబ్బ‌ల‌క్ష్మి క‌న్నుమూత‌

Subbalakshmi: ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టి సుబ్బ‌ల‌క్ష్మి (87) క‌న్నుమూసారు. కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమెను కేర‌ళ‌లోని ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె నిన్న మ‌ర‌ణించారు. మ‌ల‌యాళంలో బామ్మ‌గా ఎన్నో సినిమాల్లో న‌టించిన సుబ్బ‌ల‌క్ష్మి.. తెలుగులో ఏమాయ చేసావె సినిమాలో జెస్సీ అమ్మ‌మ్మ పాత్ర‌లో న‌టించారు. 2003లో వ‌చ్చిన క‌ళ్యాణ రాముడు సినిమాలో కూడా న‌టించారు.