Election Time: ఒక ప్లాన్.. ఒక విజన్..!
Hyderabad: ఎన్నికల సమయంలో (election time) రెండు రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయ్. అవే ప్రతినిధి 2 (prathinidhi 2), యాత్ర 2 (yatra 2). ఈ రెండు సినిమాలు రెండు రాజకీయ పార్టీల గురించే అని ఈపాటికే క్లియర్‌గా అర్థమైపోయింది. మహి వి రాఘవ్ తీయబోతున్న యాత్ర 2.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy) గురించి ఉండబోతోంది. ఇక ప్రతినిధి 2 సినిమాను టీవీ 5 మూర్తి డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమా మొత్తం జర్నలిజం ఆధారంగా ఉండబోతోందని పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. ఈ రెండు సినిమాల్లో రెండు పార్టీలు తమ పాజిటివ్ సైడ్‌ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అనుకుంటున్నాయి.
అయితే ప్రతినిధి 2 సినిమా మొత్తం TDP సపోర్ట్ చేసే విధంగా ఉండబోతోందని తెలుస్తోంది. అందుకే సరిగ్గా ఏపీ ఎన్నికలకు (election time) ముందు రిలీజ్ అవబోతోందని టాక్. ఇకపోతే యాత్ర-2 సినిమాకు YSRCP ప్రతినిధి-2 సినిమాకు TDP ఫండ్స్ ఇచ్చాయని కూడా టాలీవుడ్ వర్గాల సమాచారం. యాత్ర-2 సినిమా మొత్తం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రపై ఉండబోతోంది. ఈ సినిమా కూడా ఎన్నికలకు ముందు రిలీజ్ అవుతుంది. ఎన్నికల్లో గెలిచేలా సినిమాలో జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన సీన్స్ ఉండబోతున్నాయట. ఇక ప్రతినిధి సినిమా రిలీజ్ అయినప్పుడు అసలు పార్ట్ 2 వస్తుందో లేదో అన్నది అప్పట్లో ఏమీ చెప్పలేదు. ఇప్పుడు యాత్ర-2 వల్ల ఎక్కడ YSRCP మళ్లీ అధికారంలోకి వస్తుందోనని TDP ప్రతినిధి-2 ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. (election time)
TDPకి, YSRCPకి ఈ రెండు సినిమాలు ఉన్నాయి. మరి ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అసెంబ్లీ గడప తొక్కాలని ప్రయత్నిస్తున్న జనసేనకు (janasena) ఏముంది? పవన్ కళ్యాణ్ (pawan kalyan) గురించి ఏ సినిమాను కూడా తీయలేని పరిస్థితి. బహుశా.. పవన్ నటించిన కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు సినిమాను రీరిలీజ్ చేస్తారేమో చూడాలి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని పవన్ ఎలా ప్రశ్నిస్తున్నారో.. ఆ సినిమాలో కూడా రాంబాబు క్యారెక్టర్ ఉంటుంది.