Yash కొత్త సినిమా.. కింది స్థాయి వాళ్ల‌కు కాద‌ట‌

Yash: రాకింగ్ స్టార్ య‌ష్ KGF, KGF 2 త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. ఈసారి తీయ‌బోయే సినిమా KGFకు ధీటుగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అందుకే కాస్త టైం తీసుకుని ఓ కొత్త సినిమాను ఒప్పుకున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ ఈరోజు జ‌రిగింది. సినిమాకు టాగ్జిక్ (toxic) అనే పేరు పెట్టారు. అయితే టైటిల్ క‌న్నా దానికి పెట్టిన క్యాప్ష‌న్ వైర‌ల్ అవుతోంది. ఓన్లీ ఫ‌ర్ గ్రోన్ అప్స్ అని క్యాప్ష‌న్ ఇచ్చారు. అంటే మ‌న మీమ్ భాష‌లో చెప్పాలంటే కింద స్థాయి వాళ్ల‌కు కాదు అని అర్థం. గీతూ మోహ‌న్ దాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌నున్నారు. గోవాకు చెందిన డ్ర‌గ్స్ మాఫియాకు సంబంధించిన నేప‌థ్యంలో యాక్ష‌న్ ఓరియెంటెడ్ సినిమాగా తీయ‌బోతున్నారు. ఓ లేడీ డైరెక్ట‌ర్ ఈ బ్యాక్‌డ్రాప్‌తో సినిమా తీయ‌బోతున్నారంటే సాహ‌స‌మ‌నే చెప్పాలి.