Harsha Sai: యూట్యూబర్‌పై యువతి ఫిర్యాదు
Harsha Sai: నలుగురికీ సాయం చేస్తూ.. ఆ సాయం చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తూ ఫేమస్ అయ్యాడు యూట్యూబర్ హర్ష సాయి. అలాంటి హర్ష సాయిపై ఓ యువతి మోసం చేసాడంటూ కేసు పెట్టింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసాడంటూ నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు వేసింది. హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణపై కూడా ఫిర్యాదు చేసింది. బాధితురాలు గత బిగ్ బాస్ సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఆ అమ్మాయి నుంచి రూ.2 కోట్లు తీసుకుని సాయి మోసం చేసాడట. హర్షసాయి నటిస్తున్న మెగా లోడాన్ అనే సినిమాకు ఆ అమ్మాయే నిర్మాతగా వ్యవహరిస్తోంది.