Multistarrer: మెహ‌ర్ కొత్త సినిమా.. ఒప్పుకుంటారా?

Hyderabad: భోళా శంక‌ర్ (bhola shankar) సినిమాతో మ‌రో ఫ్లాప్ ఖాతాలో వేసుకున్నారు మెహ‌ర్ ర‌మేష్‌ (meher ramesh). ఎక్క‌డ చూసినా యావ‌రేజ్ టాక్ కంటే ఫ్లాప్ టాకే ఎక్కువ‌గా ఉంది. అయితే చిరంజీవితో భోళా శంక‌ర్ సినిమా చేస్తున్న స‌మ‌యంలోనే మెహ‌ర్.. కీర్తి సురేష్‌ (keerthy suresh), త‌మ‌న్నాల‌తో (tamanna) ఒక మ‌ల్టీస్టార‌ర్ (multistarrer) ప్లాన్ చేసార‌ట‌. ఇందుకు వాళ్లు కూడా ఒప్పుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఇప్పుడు భోళా శంక‌ర్ రిజ‌ల్ట్ చూసాక ఆ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో న‌టించేందుకు ఒప్పుకుంటారా లేదా అనే టాక్ మొదలైంది. మాకు హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేదు సినిమాలు చేసుకుంటూపోతే చాలు అనుకునేవాళ్లు మాత్ర‌మే ఈ ప్రాజెక్ట్‌లో న‌టిస్తారు. త‌మ‌న్నా, కీర్తి సురేష్‌ల నిర్ణ‌యం ఏంటో మ‌రి..! (multistarrer)