Sitara: మేనత్త రాలేకపోయింది.. మరి సితార?
Hyderabad: ఇప్పుడు టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ ఎవరైనా ఉన్నారంటే.. అది ఘట్టమనేని ప్రిన్సెస్ సితార (sitara). సూపర్ స్టార్ మహేష్ బాబు (mahesh babu), నమ్రత శిరోద్కర్‌ల (namrata shirodkar) గారాలపట్టి. 11 ఏళ్లకే ఓ జువెలరీ బ్రాండ్‌తో తన కలెక్షన్‌ను లాంచ్ చేసేసింది. అమెరికాలోని టైమ్స్ స్క్వేర్ బిల్డింగ్‌పై వెలిగిపోయింది. ఇందుకోసం సితార (sitara) అందుకున్న మొదటి రెమ్యునరేషన్ అక్షరాలా కోటి రూపాయలు. ఇప్పటివరకు ఏ స్టార్ కిడ్‌కి కూడా ఇంత పే చెక్ రాలేదు. మొదటి సంపాదన కావడంతో ఆ డబ్బు మొత్తం ఛారిటీకి విరాళంగా ఇచ్చానని సితార తెలిపింది. సితారకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడిప్పుడే తన తండ్రితో కలిసి సితార ఈవెంట్లకు అటెండ్ అవుతూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది.
ఇప్పుడు చాలా మంది టాలీవుడ్ మీడియా ప్రశ్న ఏంటంటే.. సితార (sitara) సినిమాల్లో ఎంట్రీ ఇస్తుందా అని. ఇదే ప్రశ్న సితారను అడిగితే.. ఇప్పుడైతే కాదు కానీ ఆ ప్లాన్స్ అయితే ఉన్నాయి అనింది. తమ కూతురు సినిమాల్లోకి వస్తానంటే మేం మాత్రం కాదని అనం అని నమ్రత కూడా చెప్పేసారు. కాకపోతే ఇంకా సితార మేజర్ కూడా కాలేదు. కాస్త 16, 17 వస్తే హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వచ్చు. అయితే సినిమాల్లోకి సితార ఎంట్రీ అనగానే కొందరు ఘట్టమనేని ఫ్యాన్స్‌కి పాత రోజులు గుర్తొచ్చాయి. ఎందుకంటే.. దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ (krishna) సినిమాల్లో నటిస్తున్నప్పుడు ఆయన కూతురు మంజుల (manjula) కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. అప్పట్లో ఆమెకు బోలెడు అవకాశాలు కూడా వచ్చాయి.
కానీ అప్పట్లో ఇప్పుడున్నట్లు కాదుగా. సంప్రదాయాలు, పద్ధతులకు ఎక్కువ విలువ ఇచ్చేవారు. ఘట్టమనేని వంశం అంటేనే ఓ దేవాలయంలా భావించేవారు అప్పటి ఫ్యాన్స్. అలాంటిది ఆ ఇంటి ఆడపిల్ల సినిమాల్లోకి వస్తానంటే ఎలా అని హంగామా చేసారు. మంజుల హీరోయిన్‌గా నటిస్తే ఇంటి ముందే పెట్రోల్ పోసుకుని చచ్చిపోతాం అని బెదిరించేవారట. దాంతో హీరోయిన్ అవుదామనుకున్న మంజుల కల కలలాగే మిగిలిపోయింది. అలా ఆమె సైడ్ క్యారెక్టర్స్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. (sitara)
మేనత్త వల్ల కాలేదు. మరి సితార (sitara) అయినా ఆ కల నెరవేరుస్తుందో లేదో చూడాలి. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచయం అయ్యే ఏకైక వారసురాలు సితార. ఇప్పుడున్న ఫ్యాన్స్ కూడా సితార రావాలనే అనుకుంటున్నారు. ఇక గౌతమ్ గురించి చెప్పాలంటే.. ప్రస్తుతం తన ఫోకస్ అంతా గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడంపైనే ఉందట. సో.. గౌతమ్ సినిమాల్లోకి రావాలన్నా ఒక ఏడు, ఎనిమిదేళ్లు పట్టొచ్చు.
అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. సితార, గౌతమ్‌లు కాకుండా మరొకరిపై ఫోకస్ ఎక్కువ అవుతోంది. అతను ఎవరో కాదు. మహేష్ బాబు మేనల్లుడు. అదేనండీ.. సుధీర్ బాబు (sudheer babu) కొడుకు చరిత్ మానస్ (charith manas). మొన్న ఏదో ఈవెంట్‌లో సుధీర్ బాబుతో పాటు కలిసి వచ్చాడు చరిత్. అసలు ఆ వాకింగ్ స్టైల్, ఆ స్మార్ట్‌నెస్ చూడగానే మహేష్ బాబు మళ్లీ పుట్టాడేమో అనిపించేలా ఉన్నాడు. మేనమామ లాంటి స్వాగ్.. ఆ నవ్వు చూస్తుంటే.. గౌతమ్, సితారల కంటే ముందు చరిత్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేలా ఉన్నాడని టాక్.