Vyooham: జ‌గ‌న్ అస‌లు క్యారెక్ట‌ర్ చూపిస్తా

Hyderabad: రామ్ గోపాల్ వ‌ర్మ (ram gopal varma) తీస్తున్న వ్యూహం (vyooham) సినిమాపై భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. దివంగ‌త నేత వివేకా హ‌త్య (ys viveka murder case) కేసు నేప‌థ్యంతో వ‌ర్మ ఈ సినిమాను తీస్తున్నారు. రేపు స్వాతంత్ర్య దినోత్స‌వం (independence day) సంద‌ర్భంగా ట్రైలర్‌ను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు వ‌ర్మ ప్ర‌క‌టించారు. ఈ సినిమాలో ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (jagan mohan reddy) క్యారెక్ట‌ర్‌లో అజ్మ‌ల్ అమీర్ (ajmal ameer) న‌టిస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అస‌లు క్యారెక్ట‌ర్ ప్ర‌జ‌ల‌కు చూపిస్తాన‌ని అంటున్నారు వ‌ర్మ‌.

“” జ‌గ‌న్ చాలా డేరింగ్ ప‌ర్సన్. అందుకే ఆయ‌నంటే నాకు ఇష్టం. వ్యూహం సినిమా అంత‌కుముందు నేను తీసిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ (lakshmi’s ntr)  సినిమాలాగే ఉంటుంది. అయితే ఈ సినిమాకు రాబోయే ఎన్నిక‌ల‌కు సంబంధంలేదు. నేను కేవ‌లం సినిమా ద‌ర్శ‌కుడిగా సినిమా తీసాను. అంద‌రూ అనుకుంటున్న‌ట్లు TDP అధినేత చంద్ర‌బాబు నాయుడుపై కోపంతో నేను ఈ సినిమా తీయ‌లేదు. జ‌గ‌న్ జీవితంలో ఏం జ‌రిగిందో అది మాత్ర‌మే చూపించ‌బోతున్నాను. కేవ‌లం నిజాలు మాత్ర‌మే చెప్ప‌బోతున్నాను. సినిమాలో చూపించబోయే సీన్ల‌న్లీ రియ‌ల్ లొకేష‌న్ల‌లో తీసాం. దాంతో మా నిర్మాత దాస‌రి కిర‌ణ్ కుమార్‌కు కాస్త ఎక్క‌వే ఖ‌ర్చ అయ్యింది. ఈ సినిమా విష‌యంలో ఎలాంటి రాజీ ప‌డబోం “” అని తెలిపారు వ‌ర్మ‌. (vyooham)