Bandla Ganesh: BRO ఈవెంట్‌కి వ‌స్తారా?

Hyderabad: ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) అంటే బండ్ల గ‌ణేష్‌కి (bandla ganesh) ఎంత అభిమానమో అంద‌రికీ తెలిసిందే. ఈశ్వ‌రా.. ప‌వ‌రేశ్వ‌రా… ప‌వ‌నేశ్వ‌రా.. అంటూ ఆయ‌న నామ‌మే జ‌పిస్తుంటారు. అస‌లు ప‌వ‌న్ సినిమాల‌కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉంటే అక్క‌డ బండ్ల గ‌ణేష్ స్పీచ్ ఉండితీరాల్సిందే. ప‌వ‌న్ గురించి ఆయ‌న చెప్తేనే చెవుల‌ను విన‌సొంపుగా ఉంటుంది. ప‌వ‌న్ న‌టించిన భీమ్లా నాయ‌క్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ స‌మ‌యంలో బండ్ల గ‌ణేష్ (bandla ganesh) ఇచ్చిన స్పీచ్ ఇప్ప‌టికీ ఫ్యాన్స్ మ‌ర్చిపోలేక‌పోతున్నారు. ఆయ‌న స్పీచ్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మీమ్స్ రూపంలో ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటోంది. ఆ త‌ర్వాత వ‌కీల్ సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి కూడా వ‌స్తార‌నుకున్నారు అంతా. కానీ ఆయ‌న రాలేక‌పోయారు. ఇందుకు కార‌ణం డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాసేన‌ని (trivikram srinivas).. త‌న‌ను ప‌వ‌న్‌ను విడ‌తీసింది ఆయ‌నే అని బండ్ల గ‌ణేష్‌కు సంబంధించిన ఓ ఆడియో ఫైల్ అప్ప‌ట్లో తెగ వైర‌ల్‌గా మారింది.

అయితే దీనిపై అటు బండ్ల గ‌ణేష్ కానీ త్రివిక్ర‌మ్ కానీ స్పందించ‌క‌పోయిన‌ప్ప‌టికీ.. త్రివిక్ర‌మ్ వ‌ల్లే బండ్ల గణేష్ ప‌వ‌న్‌కు దూరంగా ఉంటున్నార‌ని అంద‌రికీ అర్థ‌మైపోయింది. ఈ విష‌యం ప‌క్క‌న‌పెడితే.. రేపు సాయంత్రం శిల్ప‌క‌ళా వేదిక‌లో బ్రో (bro) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌బోతోంది. ఈ ఈవెంట్‌కు బండ్ల గ‌ణేష్ వ‌స్తారేమోన‌ని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. వ‌కీల్ సాబ్ సినిమాకు డైరెక్ష‌న్ ప‌రంగా త్రివిక్ర‌మ్ హెల్ప్ చేసారు కాబ‌ట్టి త్రివిక్ర‌మ్ ఉంటార‌ని బండ్ల గ‌ణేష్ రాలేదు. ఇప్పుడు బ్రో సినిమాలో ఆయ‌న ఇన్‌వాల్వ్‌మెంట్ పెద్ద‌గా లేదు. అలాంట‌ప్పుడు బండ్ల గ‌ణేష్ మ‌ళ్లీ రావాల‌ని.. అదే రేంజ్‌లో స్పీచ్ ఇవ్వాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.