Abhiram Daggubati: రానా పెళ్లి ఘనంగా…అభిరామ్ పెళ్లి రహస్యంగా.. ఎందుకు?
Abhiram Daggubati: దగ్గుబాటి కుటుంబంలో రానా (rana) వివాహాన్ని ఎంతో ఘనంగా చేసారు. కానీ ఆయన తమ్ముడు అభిరామ్ వివాహాన్ని మాత్రం ఎవ్వరికీ తెలీకుండా కానిచ్చేసారు. ఇటీవల దగ్గుబాటి కుటుంబం ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. దాంతో అంతా వెంకటేష్ కుమార్తె హయవాహిని వివాహానికి వెళ్తున్నారేమో అనుకున్నారు. తీరా చూస్తే అభిరామ్, ప్రత్యూషల పెళ్లి ఫోటోలు బయటికి వచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేసాయి. శ్రీలంకలోని ఓ రిసార్ట్‌లో వీరి పెళ్లి కేవలం కుటుంబీకుల మధ్య రహస్యంగా జరిగిపోయింది. రిసెప్షన్ మాత్రం అందరినీ పిలిచి గ్రాండ్‌గా చేయనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పుడు టాక్ అంతా రానా పెళ్లి అంత ఘనంగా చేసి అభిరామ్ పెళ్లిని ఎందుకు అంత రహస్యంగా చేసారు అని. గతంలో అభిరామ్ శ్రీరెడ్డిల ఎఫైర్ బయటపడటంతో టాలీవుడ్‌లో ఎంత దుమారం రేగిందో అందరికీ తెలిసిందే. దాంతో అభిరామ్ కూడా కొన్ని రోజుల పాటు ఇంట్లో నుంచి బయటకు రాలేకపోయాడు. ఇప్పుడు పెళ్లిని గ్రాండ్‌గా చేస్తే ఎక్కడ ఎవరు వచ్చి లేని పోని రచ్చ చేస్తారో అని భావించి శ్రీలంకలో వేడుకను నిర్వహించినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక అభిరామ్ చేసుకున్న అమ్మాయిది ప్రకాశం జిల్లాలోని కారంచేడు. దగ్గరి బంధువుతోనే సంబంధం కలుపుకున్నారు.