Prabhas: టార్గెట్ చేస్తున్న డైరెక్ట‌ర్?

Hyderabad: యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్‌ని (prabhas) ఓ బాలీవుడ్ డైరెక్ట‌ర్ టార్గెట్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఆయ‌న ఎవ‌రో కాదు. క‌శ్మీర్ ఫైల్స్ (kashmir files) లాంటి సెన్సేష‌న‌ల్ సినిమా తీసిన వివేక్ అగ్నిహోత్రి (vivek agnihotri). ప్ర‌భాస్ న‌టించిన రాధే శ్యాం (radhe shyam) సినిమా అన్ని భాష‌ల్లో రిలీజైన సంగ‌తి తెలిసిందే. రాధే శ్యాం 2022 మార్చి 11న రిలీజ్ అయింది. అదే రోజున వివేక్ అగ్నిహోత్రి (vivek agnihotri) క‌శ్మీర్ ఫైల్స్ (kashmir files) సినిమాను రిలీజ్ చేయించారు. ఇప్పుడు వివేక్ స‌లార్ (salaar) సినిమాను టార్గెట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌శాంత్ నీల్ (prashanth neel) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ చేస్తున్నారు. అదే రోజున వివేక్ తీస్తున్న ది వ్యాక్సిన్ వార్ (the vaccine war) సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు.

నిజానికి రాధేశ్యాంతో పాటు రిలీజ్ అయిన క‌శ్మీర్ ఫైల్స్ సినిమానే బాలీవుడ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. దాంతో ప్ర‌భాస్ సినిమాతో రిలీజ్ చేస్తే సినిమా హిట్ అవుతుంద‌న్న సెంటిమెంట్ పెట్టుకున్నట్లున్నారు వివేక్. అలాంటి సెంటిమెంట్ ఉంటే ఫ‌ర్వాలేదు కానీ ఈ సారి ప్ర‌భాస్ నుంచి రాబోయేది స్మూత్ ల‌వ్ స్టోరీ కాదు. రా అండ్ ర‌స్టిక్ స్టోరీ. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎప్ప‌టినుంచో ఈ సినిమా కోసం వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. అలాంట‌ప్పుడు ది వ్యాక్సిన్ వార్ లాంటి సినిమాను స‌లార్‌తో రిలీజ్ చేయ‌డం సాహ‌స‌మ‌నే చెప్పాలి.