Salman Khan: సందీప్‌పై స‌ల్మాన్ అప్‌సెట్

Salman Khan: బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్.. యానిమ‌ల్ ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా (sandeep reddy vanga) ప‌ట్ల అప్‌సెట్‌గా ఉన్నార‌ట‌. ఇటీవ‌ల స‌ల్మాన్ ద‌గ్గ‌రికి ఒక సూప‌ర్ క‌థ ప‌ట్టుకుని సందీప్ వెళ్లార‌ట‌. సినిమా క‌థ న‌చ్చ‌డంతో తాను కూడా చేస్తాన‌ని ఒప్పుకున్నార‌ట. యానిమ‌ల్ సినిమా కంటే ముందు డెవిల్ సినిమా అనుకున్నార‌ట వంగ‌. స‌ల్మాన్ ఖాన్ కంటే ముందు ఈ క‌థ‌ను సందీప్ రెడ్డి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు (mahesh babu) వినిపించారు.

స‌ల్మాన్‌కి ఎందుకు కోపం వ‌చ్చింది?

డెవిల్ టైటిల్ అనుకున్న‌ప్పుడు స‌ల్మాన్ ఖాన్ కాస్త అప్‌సెట్ అయ్యార‌ట‌. ఎందుకంటే స‌ల్మాన్ న‌టించిన కిక్ (kick) సినిమాలో ఆయ‌న పేరు డెవిల్. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల డెవిల్ సినిమా ఆగిపోయింది. అటు స‌ల్మాన్ ఖాన్ కూడా కిక్ 2ని ప‌క్క‌న‌పెట్టేసి వేరే సినిమాపై ఫోక‌స్ పెట్టారు. ఇటు సందీప్ రెడ్డి కూడా యానిమ‌ల్ స్క్రిప్ట్ రాసేసుకున్నాడు.

ఇప్పుడు సల్మాన్‌కి వంగ అవ‌స‌రం

స‌ల్మాన్ ఖాన్‌కు చాలా కాలంగా ఒక్క హిట్ కూడా లేదు. సో ఇప్పుడు ఈగోలు ప‌క్క‌న పెట్టి సందీప్‌తో సినిమా చేయాల‌ని అనుకుంటున్నారు. ఎటూ సందీప్ రాసుకున్న డెవిల్ సినిమా కార్య‌రూపం దాల్చ‌లేదు కాబ‌ట్టి స‌ల్మాన్‌తో ప్లాన్ చేసే యోచ‌న‌లో సందీప్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.