Salaar: ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు జ‌ర‌గ‌లేదు? కార‌ణ‌మేంటి?

Salaar: పెద్ద సినిమాలు రిలీజ్ అవుత‌న్నాయంటే గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు చేసి మరీ ఆడియ‌న్స్‌కు మ‌రింత హైప్ ఇస్తుంటారు నిర్మాత‌లు. రెబెల్ స్టార్ ప్ర‌భాస్ (prabhas) నటించిన సినిమా అంటే ఇంకే రేంజ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండాలి? కానీ హోంబ‌ళే ఫిలింస్ సంస్థ కానీ మైత్రి మూవీ మేక‌ర్స్ కానీ ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా లేకుండా నేరుగా సినిమాను థియేట‌ర్‌లో రిలీజ్ చేసేస్తున్నారు.

ఇందుకు కార‌ణం హోంబ‌ళే ఫిలింస్ అధినేత విజ‌య్ కిర్గందూర్‌కు అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాల‌న్న ఆలోచ‌నే లేదంట‌. ఎందుకంటే ప్ర‌భాస్, ప్ర‌శాంత్ నీల్ వేరే ప‌నుల‌లో బిజీగా ఉండ‌టంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ బ‌దులు స‌క్సెస్ పార్టీ గ్రాండ్‌గా ఇద్దామ‌ని డిసైడ్ అయ్యారు. సో సినిమా ఎలా ఉందో ఎన్ని రికార్డులు బ‌ద్ద‌లుకొడుతుందో 22న తెలిసిపోతుంది.