Dil Raju: అంటే రామ్ చ‌ర‌ణ్ ప్యాన్ ఇండియా న‌టుడు కాదా?

Dil Raju: ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు చేసిన కామెంట్స్ కాస్త వైర‌ల్ అవుతున్నాయి. పాపం ఆయ‌న వేరే ఉద్దేశంతోనో కావాలనో అలా అని ఉండ‌రు కానీ మెగా పవ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) అభిమానులు మాత్రం కాస్త హ‌ర్ట్ అయ్యారు.

అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాల్లో ల‌వ్ మీ అనే సినిమా కూడా ఉంది. ఈ సినిమాలోని ఓ పాటను నిన్న లాంచ్ చేసారు. ఈ సంద‌ర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్ర‌భాస్ ప్యాన్ ఇండియా స్టార్స్‌గా ఎదిగారు అని కామెంట్ చేసారు. ఆయ‌న రామ్ చ‌ర‌ణ్ పేరు తీయ‌క‌పోవ‌డంతో రామ్ చ‌ర‌ణ్ ప్యాన్ ఇండియా స్టార్ కాదా అంటూ ట్విట‌ర్‌లో కామెంట్స్ చేస్తున్నారు. దిల్ రాజు రామ్ చ‌ర‌ణ్‌తో గేమ్ చేంజ‌ర్ సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్, ప్ర‌భాస్, అల్లు అర్జున్ ఆల్మోస్ట్ ఒకేసారి ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టారు. కానీ రామ్ చ‌ర‌ణ్ వారి కంటే లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా త‌క్కువ స‌మ‌యంలో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడ‌ని మ‌న‌కు తెలీదా ఏంటి..!