Namrata: జగన్, మహేష్ వీడియోను పోస్ట్ చేసి ఎందుకు డిలీట్ చేసినట్లు?
Namrata: మహేష్ బాబు (mahesh babu) సతీమణి నమ్రత శిరోద్కర్ (namrata shirodkar) ఈరోజు ఉదయం ఓ వీడియో పోస్ట్ చేసారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy), మహేష్ బాబుని కలిపి గుంటూరు కారం సినిమాలోని ఎవరి లెక్కలు ఎప్పుడు తేల్చాలి పాటను బ్యాక్ గ్రౌండ్లో యాడ్ చేసిన వీడియోను నమ్రత ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసారు. అయితే కొన్ని సెకన్లలోనే ఆ వీడియోను డిలీట్ చేసేసారు. అసలు ఆ వీడియోను నమ్రత ఎందుకు పోస్ట్ చేసినట్లు? గుంటూరు కారం టికెట్ ధరలను ఏపీ ప్రభుత్వం పెంచినందుకు థ్యాంక్స్ చెప్తూ అలా వీడియోను పెట్టారా? లేక వచ్చే ఎన్నికల్లో కూడా జగనే గెలుస్తారని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పడానికి ట్రై చేస్తున్నారా?
Video Player
00:00
00:00