తొలి సూపర్‌స్టార్.. భర్తను వదిలేసి నటుడితో ఎందుకు లేచిపోయింది?
Devika Rani: పై ఫోటో కనిపిస్తున్న అందాల తారను చూసారా..? ఈమె పేరు దేవికా రాణి. 1930ల్లో అప్పుడప్పుడే సినిమా రంగం ప్రపంచానికి పరిచయం అవుతున్న సమయంలో దేవికా రాణి సినిమాలు మొదలుపెట్టి మొదటి సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు.. తెరపై ఒక హీరోకి లిప్ కిస్ ఇచ్చిన మొట్ట మొదటి హీరోయిన్ కూడా ఈమే.
అయితే అప్పటివరకు హీరోయిన్‌గా మాత్రమే పాపులర్ అయిన దేవిక రాణి.. హిందీ చిత్ర పరిశ్రమలోనే టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచే పని ఒకటి చేసి నవ్వుల పాలయ్యారు. దేవికా రాణి సినిమాల్లోకి రాకముందే బాంబే టాకీస్ అధినేత, ప్రముఖ నిర్మాత హిమాన్షు రాయ్‌ని పెళ్లి చేసుకున్నారు. దాంతో హిమాన్షు తీసే ప్రతి సినిమాలో హీరోయిన్‌గా దేవికనే నటించారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో జీవన్ నయ్యా అనే సినిమా దేవిక జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ సినిమాలో నజమ్ ఉల్ హసన్ అనే వ్యక్తి హీరోగా నటించారు.
షూటింగ్ సమయంలో దేవిక, హసన్ ప్రేమించుకున్నారు. దాంతో భర్తను వదిలేసి దేవిక, హసన్ లేచిపోయారు. అప్పట్లో ఇప్పుడు ఉన్నట్లు సోషల్ మీడియా, టీవీ ఛానెళ్లు అంతగా లేవు కాబట్టి వారి గురించి ఎవ్వరికీ తెలీలేదు. తన భార్య మోసం చేసి వెళ్లిపోయిందని హిమాన్షు కుంగిపోయాడు. తన ఆస్తిని పోగొట్టుకున్నాడు. (devika rani)
ఆ సమయంలో హిమాన్షు దేవికకు అన్న వరస అయ్యే శశిధర్ ముఖర్జీని కలిసి తన భార్యను తన వద్దకు తీసుకురావాల్సిందిగా కోరాడు. శశిధర్ దేవికను కలిసి నచ్చజెప్పగా తనకు డబ్బు ఎక్కువగా ఇస్తే వస్తానని చెప్పింది. ఇందుకు ముందు హిమాన్షు ఒప్పుకున్నాడు కానీ సినిమాలో మాత్రం దేవిక పక్కన హీరోగా హసన్‌ని కాకుండా శశిధర్ బావ మరిది అయిన కుముద్‌లాల్ గంగూలీని పెట్టాడు. ఆ తర్వాత కుముద్‌లాల్ అశోక్ కుమార్‌గా పేరు మార్చుకుని పాపులర్ అయ్యారు.
ఆ తర్వాత హసన్‌కు సినిమాలు లేక పాకిస్తాన్ వెళ్లిపోయాడు. ఇక దేవికా రాణి అన్నీ మర్చిపోయి సినిమాలు చేసుకుంటూ 1941 వరకు టాప్ హీరోయిన్‌గా, లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది. తన భర్త చనిపోయాక 1945లో సినిమాలకు దేవిక రాణి దూరమైంది. ఆ తర్వాత ఆమె లేని లోటును తీర్చేందుకు నర్గిస్ దత్, మధుబాలలు ఇండస్ట్రీకి వచ్చారు. (devika rani)