Samantha: చై.. నువ్వు మంచి తండ్రివి అవుతావ్
Samantha: సమంత, నాగచైతన్య విడిపోయి ఇప్పటికే మూడేళ్లు అవుతోంది. ఇప్పుడు నాగచైతన్య నటి శోభిత ధూళిపాళ్లను పెళ్లాడబోతున్నాడు. ఈ నేపథ్యంలో సమంత నాగచైతన్యకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. పెళ్లి వేడుక సమయంలో సమంత చై గురించి ఓ మాటన్నారు. కొన్ని వందల ఏళ్ల పాటు నువ్వే నా భర్తగా రావాలి. నువ్వు బెస్ట్ మగాడివి. మన బిడ్డకు నువ్వు గొప్ప తండ్రివి అవుతావ్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పటి వీడియోను ఫ్యాన్స్ ఇప్పుడు తీసి వైరల్ చేస్తున్నారు.