Prithviraj Sukumaran: మేక‌తో సెక్స్ సీన్.. పృథ్వీరాజ్ ఏమ‌న్నారు?

Prithviraj Sukumaran: ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమారన్ న‌టించిన ఆడు జీవితం (Adujeevitham) సినిమాకు మంచి పాపులారిటీ వ‌చ్చింది. తెలుగులోనూ ఈ సినిమాను రిలీజ్ చేయ‌నున్నారు. 2008లో వ‌చ్చిన న‌వ‌ల ఆధారంగా బ్లెస్సీ ఈ సినిమాను తీసారు. అయితే న‌వ‌ల‌లో ముఖ్య పాత్ర‌దారుడైన న‌జీబ్ నిస్స‌హాయ స్థితిలో త‌న కోరిక‌ను చంపుకోలేక మేక‌తో సెక్స్ చేస్తాడు. అయితే ఈ అంశాన్ని మాత్రం బ్లెస్సీ తెర‌పై చూపించాల‌ని అనుకోలేదు. దాంతో మేక‌తో సెక్స్ సీన్ అనే స‌న్నివేశాన్ని తీసేసి మిగ‌తా న‌వ‌ల‌ను సినిమాగా తీసామ‌ని తెలిపారు పృథ్వీ.