Pushpa 2: ప్రాణ స్నేహితులు.. బద్ధ శత్రువులు అయ్యారా?
Pushpa 2: పుష్ప సినిమా ఒక టాలీవుడ్ నటుడికి తొలి జాతీయ అవార్డుని తెచ్చిపెట్టింది అని గర్వపడుతుంటే.. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా రాబోతున్న పుష్ప 2 సినిమా ఇద్దరు ప్రాణ స్నేహితులను బద్ధ శత్రువులుగా మార్చిందా అన్నట్లు ఉంది ఇప్పుడు పరిస్థితి. పుష్ప 2 షూటింగ్ విషయంలో ఎప్పటి నుంచో గందరగోళం ఉంది. ఓ సన్నివేశంలోని నటీనటులు సరిగ్గా యాక్ట్ చేయడం లేదని దర్శకుడు సుకుమార్ తన ఫోన్‌ను సెట్స్‌లో నేలకేసి కొట్టారట. ఇప్పుడేమో అల్లు అర్జున్ సినిమాలో కీలకం అయిన తన గెడ్డాన్ని తీసేసారు. పైగా నిన్న ఆయన విమానంలో ఎక్కడికో వెళ్తున్న వీడియో కూడా వైరల్ అయ్యింది.
సుకుమార్ షూటింగ్ షెడ్యూల్స్ సరిగ్గా ప్లాన్ చేయకుండా ఎప్పుడు పడితే అప్పుడు పిలుస్తున్నాడని దాంతో అల్లు అర్జున్‌కి ఒళ్లు మండి ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లాడని టాక్ వినిపిస్తోంది. ఆ తర్వాత బన్నీ ఇండియాకు తిరిగి రాగానే.. సుకుమార్ వెకేషన్‌కి వెళ్లారట. ఆ తర్వాత సుకుమార్ రాగానే.. ఇప్పుడు మళ్లీ అల్లు అర్జున్ యూరప్ వెళ్లినట్లు సమాచారం. పైగా ఇప్పుడు బన్నీ గెడ్డం కూడా తీసేసాడు కాబట్టి ఆ గెడ్డం వస్తే తప్ప షూటింగ్ కంటిన్యూ చేయడానికి లేదు. కారణం ఏదైనప్పటికీ ఇద్దరు ప్రాణ మిత్రులను ఈ పుష్ప సినిమా బద్ధ శత్రువులను చేసిందే అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.