Mahesh Babu స‌పోర్ట్ చేస్తే మీకేంటి?

Hyderabad: యంగ్ హీరో సుమంత్ ప్ర‌భాస్ (sumanth prabhas) న‌టించిన మేం ఫేమస్ (mem famous) సినిమాకు సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు (mahesh babu) స‌పోర్ట్ చేసారు. సినిమా చూసాన‌ని..సినిమా మొత్తం సుమంత్ లాంటి ఒక కుర్రాడు తీసాడంటే న‌మ్మ‌బుద్దికాలేద‌ని అన్నారు. త‌న ప్రొడ‌క్ష‌న్ హౌస్ నుంచి కూడా ఛాన్సెస్ ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. అయితే మ‌హేష్ బాబు సినిమాను మెచ్చుకోవ‌డంపై చాలా మంది ఫ్యాన్స్ నోటికొచ్చిన‌ట్లు కామెంట్లు పెడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు నిర్మాత శ‌ర‌త్ చంద్ర‌.

“నేనేదో సినిమాకు ప్ర‌మోష‌న్‌లా ఉంట‌దని మ‌హేష్ (mahesh babu) అన్న‌కు సినిమా చూపించా. ఆయ‌న‌కు న‌చ్చింది. బాగుంది అని ట్వీట్ చేసారు. ఆయ‌న మాకు స‌పోర్ట్ చేస్తుంటే కొంద‌రు ఫ్యాన్స్‌కి ప్రాబ్లం ఏంటి? నా ట్వీట్ కింద ఎందుకు అన్ని బ్యాడ్ కామెంట్స్? జీవితంలో పాజిటివ్‌గా ఉంటేనే ముందుకు వెళ్ల‌గ‌లుగుతాం. పాజిటివిటీ ఉంది కాబ‌ట్టే 23 ఏళ్ల సుమంత్ ప్ర‌భాస్ లాంటి కుర్రాడు ఈరోజు హీరోగా, డైరెక్ట‌ర్‌గా మీ ముందు ఉన్నాడు. అయితే మ‌హేష్ అన్న మాకు స‌పోర్ట్ చేసారు. ఆయ‌న ఫ్యాన్స్‌కి ఇది అన‌వ‌స‌రం” అని మండిప‌డ్డారు. (mem famous)