Guntur Kaaram: లోప‌ల చాలా ఉంది.. ఫ్యాన్స్‌కి పండ‌గే!

Guntur Kaaram: సూపర్‌స్టార్ మ‌హేష్ బాబు (mahesh babu), త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ (trivikram srinivas) కాంబినేష‌న్‌లో వ‌స్తున్న గుంటూరు కారం సినిమా రోజు రోజుకీ హైప్ పెంచేస్తోంది. ఈ మ‌ధ్య‌కాలంలో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న మ‌హేష్ నుంచి మ‌ళ్లీ మాస్ క‌థ‌ను కోరుకుంటున్నారు ఫ్యాన్స్. ఆడియ‌న్స్ ప‌ల్స్ తెలిసిన త్రివిక్ర‌మ్ ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ పెట్టేలా సినిమాను ప్లాన్ చేసిన‌ట్లు ఇన్‌సైడ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి.

సినిమాలో తల్లి సెంటిమెంట్‌కు సంబంధించిన సీన్స్ హృద‌యాల‌ను హ‌త్తుకునేలా ఉంటాయ‌ట. మ‌రీ సెంటిమెంట్ ఎక్కువ అయిపోకుండా గురూజీ మాస్ ఫైట్స్‌ని ప్లాన్ చేసారు. ఈ ఫైట్స్‌తో ఫ్యాన్స్‌కి పూన‌కాలు ప‌క్కా. అంతేకాదు ఇందులో ఓ స‌ర్‌ప్రైజ్ రీమిక్స్ పాట కూడా ఉండ‌బోతోంద‌ట‌. క‌చ్చితంగా సూపర్‌స్టార్ కృష్ణ పాట‌నే రీమిక్స్ చేసి ఉంటార‌నుకోండి. ఇలా చెప్పుకుంటూ పోతే లోప‌ల చాలానే దాచి ఉంచిన‌ట్లు తెలుస్తోంది.