Salaar: టికెట్ ధ‌ర‌లు RRR కంటే త‌క్కువా?

Salaar: యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్ (prabhas) న‌టించిన స‌లార్ సినిమా 22న రిలీజ్ కాబోతోంది. దాంతో ప్రీ బుకింగ్ సేల్స్ జోరందుకున్నాయి. అయితే టికెట్ ధ‌ర‌ల విష‌యానికొస్తే RRR సినిమా కంటే స‌లార్ టికెట్ల ధ‌ర త‌క్కువ‌గా ఉంది. నిజాం ప్రాంతాల్లో సింగిల్ స్క్రీన్ టికెట్ల ధ‌ర‌పై రూ.50, మ‌ల్టీప్లెక్సుల‌ టికెట్ ధ‌ర‌ల‌పై రూ.100 పెంచారు. RRR సినిమాకైతే రూ.400 పెంచేసారు.

అయితే స‌లార్ టికెట్ ధ‌ర‌ల‌పై క్యాప్ ఉండాల‌ని నిర్మాణ సంస్థ హోంబ‌ళే ఫిలింస్ భావిస్తోంది. దీని వ‌ల్ల ఎక్కువ మంది సినిమా చూసేందుకు వీలు ఉంటుంద‌ని ఈ నిర్ణ‌యం తీసుకుంది. నైజాంలో తెలుగు హ‌క్కుల‌ను మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ రూ.70 కోట్ల‌ను కొనుగోలు చేసింది. దాంతో తెలంగాణ ప్ర‌భుత్వం టికెట్ ధ‌ర‌ల‌ను పెంచితే బాగుంటుంద‌ని మైత్రి మూవీ మేకర్స్ భావిస్తోంది. స‌లార్ లాంటి సినిమాల‌ను ఓపెనింగ్ డే క‌లెక్ష‌న్స్ ఎంతో ముఖ్యం. తర్వాత సినిమా ఎంత వ‌ర‌కు క‌లెక్ష‌న్లు రాబ‌డుతుంది అనేది ఓపెనింగ్ డే క‌లెక్ష‌న్లను బ‌ట్టి తెలుస్తుంది.