BRO: రేట్లు, షోలు పెంచ‌క్క‌ర్లేదు..!

Hyderabad: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌తో  (sai dharam tej) క‌లిసి న‌టించిన బ్రో (bro) సినిమా ఈ నెల 28న రిలీజ్ అవ‌బోతోంది. స‌ముద్ర‌ఖ‌ని (samuthirakani) డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు టికెట్ ధ‌ర‌లు పెంచ‌మ‌ని అడ‌గాల‌నుకోవ‌డంలేద‌ని నిర్మాత టీజీ విశ్వ‌ప్ర‌సాద్ (tg vishwa prasad) తెలిపారు. బ్రో (bro) సినిమాను బ‌డ్జెట్‌లోనే తీసామ‌ని ఎక్క‌డా కూడా ఓవ‌ర్ బ‌డ్జెట్ అవ్వ‌లేద‌ని తెలిపారు. టికెట్ హైక్‌లే కాదు షోలు పెంచ‌మ‌ని కూడా అడ‌గ‌మ‌ని అన్నారు. ఇప్పుడు ఎన్ని థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతుందో అన్ని థియేట‌ర్ల నుంచి పెట్టిన బ‌డ్జెట్ తిరిగి వ‌చ్చేస్తుంద‌న్న ధీమాతో ఉన్న‌ట్లు తెలిపారు.

ఇక సినిమా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఒక టైటిల్ గ్లింప్స్, టీజ‌ర్ మాత్ర‌మే రిలీజ్ చేసారు. ట్రైలర్ రాలేదు. రిలీజ్ అయిన రెండు పాట‌లు పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. అయినా ఈ సినిమాకు ఏమాత్రం హైప్ త‌గ్గ‌లేదు. అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) సినిమాకు ప్ర‌త్యేకించి హైప్ తీసుకురావాల్సిన అవ‌సరం లేద‌నుకోండి. ఈ సినిమాలో 15 ఏళ్ల క్రితం ఉన్న ప‌వ‌న్‌ని చూపించ‌బోతున్న‌ట్లు స్వ‌యంగా ప‌వ‌నే ఓసారి అన్నారు. ఇక సినిమా ఎలా ఉంది అనేది ఈ నెల 28న తెలిసిపోతుంది.