VK Naresh: ఈ తరం వారికి పెళ్లొద్దు.. మాకు కావాలి
VK Naresh: సీనియర్ నటుడు వీకే నరేష్ ఈ మధ్యకాలంలో పవిత్ర లోకేష్‌తో ప్రేమాయణం సాగించడం.. ఆమెతో కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమా తీయడం తెగ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. త్వరలో తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా అప్పట్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో పెళ్లి విషయంపై వీకే నరేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. నారా రోహిత్ నటించిన సుందరకాండ సినిమా త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో నరేష్ కీలక పాత్రలో నటించారు. ఈ సందర్భంగా పెళ్లి అనే కాన్సెప్ట్ గురించి నరేష్ మాట్లాడుతూ.. ఇప్పటి తరం వారికి అసలు పెళ్లి వద్దు. కానీ మా తరం వారేమో మళ్లీ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఎందుకంటే సంతోషంగా ఉండటం కోసం అన్నారు. ఆ తర్వాత పవిత్ర లోకేష్ గురించి ఏదో చెప్పాలనుకున్నారు కానీ ఎక్కడ మళ్లీ వివాదాస్పదం అవుతుందో అని మైక్ పక్కవారికి ఇచ్చేసారు.