VK Naresh: కౌంటింగ్ రోజున రక్తపాతమే.. అప్రమత్తంగా ఉండండి
VK Naresh: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో అధికారం మరొకరి చేతికి వెళ్లే సమయంలో రక్తపాతం జరుగుతుందని మొట్ట మొదట చెప్పింది తానేనని అన్నారు ప్రముఖ నటుడు వీకే నరేష్. ఇక కౌంటింగ్ రోజున ఈ రక్తపాతం మరింత ఎక్కువగా ఉంటుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ట్వీట్ చేసారు.
“” ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగే సమయంలో రక్తపాతం ఉంటుందని ముందగా చెప్పింది నేనే. ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో ఈ రక్తపాత ఘటనలు ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేక బృందాలు, కేంద్ర బలగాలు రంగంలోకి దిగుతున్నాయి. ఇక కౌంటింగ్ రోజున ఈ రక్తపాత ఘటనలు మరింత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను “” అని పేర్కొన్నారు.