Vishwak Sen: అతన్ని గుడ్డిగా నమ్మడం వల్లే..
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా విద్యాధర్ దర్శకత్వంలో రూపొందిన గామి (Gaami) సినిమా రేపు మహా శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గామి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో విశ్వక్ సేన్ ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంటోంది. తన టీంలోని ఒక్కో మెంబర్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు. ఇక హీరోయిన్ చాందినీ చౌదరి పడ్డ కష్టం గురించి చెప్పి అందరినీ కదిలించాడు.
గామి సినిమా మార్చి 8న విడుదల కాబోతోంది. గామి చిత్రంతో విశ్వక్ సేన్ మరోసారి హిట్టు కొట్టేలా ఉన్నాడు. కొత్త దర్శకుడు విధ్యాదర్ అందరినీ తన విజన్‌తో ఆకట్టుకునేలా ఉన్నాడు. హాలీవుడ్ సినిమా స్టైల్లో ఉందని, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని అంతా పొగిడేస్తున్నారు. టీజర్, ట్రైలర్లతోనే అందరూ ఫిదా అయ్యారు. ఇక రేపు సినిమా రాబోతోంది. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఒక్కో టీం మెంబర్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు.
విశ్వక్ సేన్ మాట్లాడుతూ… పిలవగానే వచ్చిన అడవి శేష్, నిర్మాత ఎస్కేఎన్ ఇతరులకు పెద్ద థాంక్స్. నా టీం అందరికీ కృతజ్ఞతలు. నా జీవితం మొత్తంలో ఒక మనిషి మాటను గుడ్డిగా నమ్మింది ఒక్కసారి మాత్రమే. ఆ మనిషి మాటలను గుడ్డిగా నమ్మినాను. ఆ మనిషి మాటలో ఉన్న నిజాయితీని నమ్మినాను. అలా గుడ్డిగా నమ్మడం వల్లే నా జీవితంలో ఈ రోజు ‘గామి’ ఉంది. ఆ మనిషే దర్శకుడు విద్యాధర్.
ఇప్పటి వరకు నా జీవితంలో ఎంతో మంది మంచి వారిని చూశాను.. డబ్బు ఉన్న వారిని, డబ్బు లేని వారిని, డబ్బు లేకున్నా చాలా సంతోషంగా ఉన్న వారిని చూశాను. అయితే నా జీవితం మొత్తంలో మోస్ట్ హానెస్ట్ పర్సన్ ను కలిశాను అంటే అది విద్యాధర్ అని చెప్పగలను. విద్యాధర్ ఒక గొప్ప మనిషి. ఈ సినిమాతో విద్యాధర్ వంటి గొప్ప స్నేహితుడిని సంపాదించుకున్నాను.
ALSO READ: Niharika Konidela: నిహారికను హర్ట్ చేసిన ఆ నటుడు ఎవరు?
నా డీఓపీ విశ్వనాథ్. మేము ఈ సినిమా చేస్తున్న సమయంలో చాలా మంది ఏదో చేస్తున్నారు అనుకున్నారు. కానీ నాకు అప్పుడే చూస్తున్న సమయంలో అర్థం అయ్యింది. ఇది ఒక గొప్ప సినిమాగా నిలుస్తుందని అనుకున్నాను. గామి గురించి ఎవరైనా మాట్లాడితే కచ్చితంగా డీఓపీ విశ్వనాథ్ గురించి మాట్లాడాల్సిందే. ఒక మంచి సినిమాను చేయాలని కష్టం అయినా ఈ సినిమాను మొదలు పెట్టాం. ఒక మంచి పని చేసుకుంటూ వెళ్తే దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది అనుకున్నాను. మా సినిమాకు విక్కీ అన్న అండదండలు దక్కడం చాలా సంతోషంగా ఉంది. ఆయన రాకతో సినిమా పరిధి పెద్దగా అయ్యింది. అని అన్నాడు. (Vishwak Sen)
అంతా మాట్లాడేసిన విశ్వక్ సేన్ చివరగా.. చాందినీ చౌదరి గురించి మాట్లాడాడు. చాందినీ చేసిన త్యాగం గురించి చెప్పుకొచ్చాడు. చాందినీ ఈ సినిమా కోసం ఎంత కష్టపడింది.. ఎంత ధైర్యంగా షూటింగ్‌కు వచ్చింది.. హిమాలయాల్లో ఎంత కష్టపడింది అన్న విషయాలు చెప్పి ఆమె మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగేలా చేశాడు విశ్వక్ సేన్. హిమాలయాల్లో అత్యంత ఎత్తులో షూటింగ్ చేస్తున్న టైం గురించి విశ్వక్ సేన్ చెప్పాడు.
తమ టీంలో చాందినీ ఒక్కరే అమ్మాయి అని.. ఆమెకు సాయం చేసేందుకు కూడా ఎవ్వరూ లేరని విశ్వక్ తెలిపాడు. తామైతే బాగా తింటూ, నీళ్లు తాగుతూ మార్నింగ్ నుంచి నైట్ వరకు షూటింగ్ చేసే వాళ్లమని అన్నాడు. కానీ చాందినీ మాత్రం నీళ్లు కూడా తాగేది కాదన్నాడు. నీళ్లు తాగితే వాష్ రూం వాడుకోవాల్సి వస్తుంది.. కానీ అక్కడ వాష్ రూమ్స్ కూడా ఉండేవి కాదని, అందుకే ఆమె రోజంతా నీళ్లు కూడా తాగకుండా ఉండేదని, వాష్ రూం వచ్చినా కూడా ఆపేసుకునేదని అంతలా చాందినీ కష్టపడిందంటూ విశ్వక్ సేన్ చెప్పిన మాటలు ఇప్పుడు ఆమెను మరింత అభిమానించేలా చేస్తున్నాయని, కొత్త తరహా సినిమాను చూడాలి అనుకునే ప్రేక్షకులకు ఇది తప్పకుండా నచ్చుతుంది. మెల్లగా సినిమాలోకి వెళ్తారు.. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా మీ వెంటే ఈ సినిమా ఉంటుంది. మార్చి 8న ఈ సినిమాను చూస్తారని ఆశిస్తున్నాను అన్నాడు.