Vishwak Sen: పెళ్లా.. ఆహాతో షోనా?
Hyderabad: మీ అందరి ఆశీస్సులతో కొత్త జీవితంలోకి ఎంటర్ అవబోతున్నాను అంటూ నిన్న విశ్వక్ సేన్ (vishwaks en) చేసిన అనౌన్స్మెంట్ పట్ల ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విశ్వక్ పెళ్లి (vishwak sen amrriage) చేసుకోబోతున్నారంటూ కొందరు అనుకుంటుంటే.. మరికొందరేమో ఆహా (aha) సంస్థ చేయబోయే ఓ షోను విశ్వక్ హోస్ట్ చేయబోతున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలకు ఇదో ఫ్యాషన్ అయిపోయింది. ఏదన్నా సినిమా చేయడానికి ముందు, లేదా షోని హోస్ట్ చేయడానికి ముందు ఇలాంటి పోస్ట్లు పెడుతున్నారు. ముఖ్యంగా ఆహా సంస్థ (aha) ఇలా ఎగ్జైట్మెంట్ పెంచేలా ప్రమోషన్స్ చేస్తూ ఉంటుంది. మరి విశ్వక్ (vishwak sen) ఆ స్పెషల్ అనౌన్స్మెంట్ గురించి ఏం చెప్తారో వేచి చూద్దాం.