Vishwak Sen: క‌ల్కిపై యూట్యూబ‌ర్ కామెంట్స్.. ఇచ్చిప‌డేసిన విశ్వ‌క్

Vishwak Sen slams a youtuber who criticised salaar

Vishwak Sen: ప్ర‌భాస్ న‌టించిన క‌ల్కి సినిమాపై ఓ ఊరుపేరు లేని యూట్యూబ‌ర్ కామెంట్స్ చేస్తుండ‌డంపై స్పందించారు విశ్వక్ సేన్. ఆ యూట్యూబ‌ర్ క‌ల్కిని అలా తీసారు ఇలా కాపీ కొట్టారు అని మాట్లాడుతున్న వీడియోను క‌ట్ చేసి త‌న ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసారు.

“” సినిమాలు రిలీజ్ కూడా అవ్వ‌క‌ముందే చెంబు ప‌ట్టుకుని బ‌య‌లుదేరుతున్నారు. యూట్యూబ్‌లో మీ ఇన్‌కం కోసం వేలాది మంది కుటుంబాలు ఆధార‌ప‌డి ఉన్న ఈ సినిమా ఇండ‌స్ట్రీ అంటే మ‌జాక్ అయిపోయింది మీకు. వీడు ఒక 10 నిమిషాలు షార్ట్ ఫిలిం తీస్తే అప్పుడు చూద్దాం. లేదంటే అడ్రెస్ త‌ప్పిపోయిన వాళ్లు అని వ‌దిలేద్దాం. ఇలాంటి అభిప్రాయాలు బ‌య‌ట బ‌జార్‌లో పెట్టి తిరిగేవారంతా ఒక 10 నిమిషాల షార్ట్ ఫిలిం తీసి చూపించండి. ఇలాంటివాళ్లు పైర‌సీ కంటే చాలా డేంజ‌ర్. ఒక ఫిలిం సెట్‌పై ర‌క్తం, చెమ‌ట ధార‌పోస్తూ ప‌డే క‌ష్టాన్ని తెలుసుకుంటార‌ని ఆశిస్తున్నాను. నువ్వు తియ్యి ఒక షార్ట్ ఫిలిం. అప్పుడు నీ అభిప్రాయాన్ని ఒక విలువ ఉంటుంది “” అని ఘాటుగా కామెంట్ చేసారు విశ్వ‌క్.