Vishwak Sen: నా దృష్టిలో వాళ్లు అసలు నటులే కాదు
Vishwak Sen: విశ్వక్ సేన ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ యాక్షన్ డ్రామాను కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసారు. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఆయన కల్ట్ అనే ఓ సినిమాను తీస్తున్నారు. ఇందుకోసం ఫ్రెష్ టాలెంట్స్ కోసం వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ నిర్మాణ సంస్థ కొత్త నటీనటులు కావలెను అనే అనౌన్స్‌మెంట్ చేసింది. అయితే టిక్‌టాక్ వీడియోలు చేసి పంపేవాళ్లను మాత్రం తీసుకోను అని విశ్వక్ సేన్ వెల్లడించారు. తన ఉద్దేశంలో అసలు టిక్‌టాకర్లు నటులే కాదని అభిప్రాయపడ్డారు.
“” కొంతమంది ఆడిషన్ల కోసం పంపించే వీడియోలు ఎంత చిరాగ్గా ఉంటాయో. ఒక బీజీఎం ఏసుకుని అలా నడుస్తున్నట్లు వీడియోలు పంపి అదే యాక్టింగ్ అంటారు. అసలు ముఖంలో ఎక్స్‌ప్రెషన్ ఉండదు. ఇలాంటి వారికి ఇండస్ట్రీ ఎందుకు తీసుకుంటుంది? ఒక నటుడు ఎప్పుడూ నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలి. నేను ఫలక్‌నుమా దాస్ చేస్తున్న సమయంలో ముగ్గురు నటులను గమనిస్తూ యాక్టింగ్ నేర్చుకున్నాను “” అని వెల్లడించారు