Vishwak Sen: క‌లిసి రాలేదు.. పేరు మార్చుకున్నా

Hyderabad: మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ (vishwak sen) అస‌లు పేరు అది కాద‌ట‌. త‌న అస‌లు పేరు వ‌ల్ల ఏదీ క‌లిసి రావ‌డంలేదని పేరు మార్చుకున్నాన‌ని స‌ర్‌ప్రైజింగ్ విష‌యం చెప్పారు. “నా అస‌లు పేరు దినేష్ నాయుడు. నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో నా ఫ‌స్ట్ సినిమా వెళ్లిపోమాకే రెండేళ్ల పాటు పోస్ట్‌పోన్ అయింది. దాంతో మా అమ్మానాన్న‌లు న్యూమ‌రాల‌జిస్ట్‌ను క‌లిసాను. దినేష్ నాయుడు పేరుతో ఇండ‌స్ట్రీలో ఎద‌గ‌లేన‌ని చెప్పార‌ట‌. దాంతో న‌న్నే ఏదో ఒక మంచి పేరు పెట్టుకోమ‌న్నారు. అలా నేను విశ్వ‌క్ సేన్ అనే బెంగాలీ పేరును ఎంచుకున్నాను. పేరు మార్చుకున్న నెల‌రోజుల్లోనే వెళ్లిపోమాకే సినిమా రిలీజ్ అవ్వ‌డ‌మే కాదు మ‌రో రెండు నెల‌ల‌కే త‌రుణ్ భాస్క‌ర్ సినిమాలో న‌టించే ఛాన్స్ వ‌చ్చింది” అంటూ ఇంట్రెస్టింగ్ విష‌యం చెప్పారు విశ్వ‌క్.

ఈ న‌గ‌రానికి ఏమైంది, ఫ‌ల‌క్‌నుమా దాస్ సినిమాల‌ విశ్వ‌క్ సేన్ పేరు ఇండ‌స్ట్రీలో మారు మోగిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో జోష్ మీదున్న విశ్వ‌క్.. డైరెక్ట‌ర్‌గానూ త‌న‌ని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఆయ‌న డైరెక్ట్ చేసిన దాస్ కా ధ‌మ్కీ సినిమాకి మంచి టాక్ వ‌చ్చింది. ఇప్పుడు దీని సీక్వెల్ తీసేప‌నిలో ఉన్నాడు. ఈ సినిమాతో పాటు కృష్ణ చైత‌న్య డైరెక్ష‌న్‌లో త‌న 11వ సినిమాలో న‌టిస్తున్నాడు. NTR జ‌యంతి సంద‌ర్భంగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్‌కి మంచి టాక్ వ‌చ్చింది.