Vishal: సల్మాన్‌కి పెళ్లయ్యాక చేసుకుంటా
ఎంతో కాలంగా విశాల్ (vishal) పెళ్లి వార్తల గురించి ఎన్నో రూమర్స్ వచ్చాయి. గతంలో విశాల్.. వరలక్ష్మి శరత్‌కుమార్‌లు ప్రేమలో ఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నికల విషయంలో వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్‌కు వ్యతిరేకంగా విశాల్ పోటీ చేస్తున్నాడని తెలిసి వారి మధ్య గొడవ జరిగి విడిపోయారు. విడిపోయాక అసలు తాము ప్రేమలోనే లేమని కేవలం మంచి స్నేహితులం మాత్రమేనని అన్నారు. కొన్నేళ్ల క్రితం అర్జున్ రెడ్డి ఫేం అనీషా రెడ్డితో విశాల్ నిశ్చితార్ధం జరిగింది. అయితే నడిగర్ కోసం ఓ భవనాన్ని నిర్మించాక పెళ్లి చేసుకుంటానని విశాల్ అనీషాతో చెప్పాడట. ఆమె ఒప్పుకున్నప్పటికీ ఇంకా ఆలస్యం అయితే బాగోదేమోనని నిశ్చితార్థం బ్రేక్ చేసుకున్నారు. (vishal)
ఈ మధ్యకాలంలో ఆయన లక్ష్మీ మేనన్‌తో ప్రేమలో ఉన్నారని త్వరలో వివాహం చేసుకోబోతున్నారని కోలీవుడ్ వర్గాలు కోడై కూసాయి. అందులో నిజం లేదని విశాల్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ప్రముఖ నటి అభినయతో విశాల్ పెళ్లి అంటున్నారు. ఇలా ఏడాదికోసారి తన పెళ్లిని మీడియా వాళ్లే చేస్తున్నారని తన 19 ఏళ్ల కెరీర్‌లో తనకు దాదాపు 17 సార్లు పెళ్లి చేసారని విశాల్ అన్నారు. గతంలో ప్రముఖ తమిళ నటుడు ఆర్య పెళ్లి చేసుకున్నాక తాను చేసుకుంటా అని చెప్పేవాడినని… కానీ ఇప్పుడు ఆర్య పెళ్లి అయిపోయింది కాబట్టి సల్మాన్ ఖాన్ పెళ్లయ్యాక చేసుకుంటానని అంటున్నాడు. తనకు నిజంగానే పెళ్లి ఫిక్స్ అయితే మాత్రం యావత్ భారతదేశానికి చెప్పే చేసుకుంటానని అన్నాడు విశాల్. (vishal)