Vishal: చంద్రబాబు అరెస్ట్‌పై విశాల్ స్పందన
TDP అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) అరెస్ట్‌పై తమిళ నటుడు విశాల్ (vishal) స్పందించారు. ఆయన నటించిన మార్క్ ఆంటోనీ (mark antony) సినిమా సక్సెస్ మీట్లో భాగంగా మీడియా వర్గాలు చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించాలని అడిగారు. దీనికి విశాల్ స్పందిస్తూ.. “” నాకు పర్సనల్‌గా నచ్చిన రాజకీయ నాయకుల్లో చంద్రబాబు ఒకరు. ఆయన్ను అరెస్ట్ చేసే ముందు ఇంకా లోతుగా ఆలోచించి ఈ చర్య తీసుకోవాల్సింది. ఎందుకంటే ఆయన అరెస్ట్ అయ్యాడంటే ఓ సామాన్య వ్యక్తిగా నాకు ఇంకా భయం వేస్తోంది. నేను ఇంకా లోతుగా దీని గురించి మాట్లాడలేను. చివరికి నిజం, న్యాయమే గెలుస్తాయి“” అని తెలిపారు.
మార్క్ ఆంటోనీలో ఆ డైలాగ్ ఎవరిని ఉద్దేశించో..!
మార్క్ ఆంటోనీ సినిమాలో ఓ డైలాగ్ వైరల్ అవుతోంది. జేబులో అన్నగారి ఫోటో పెట్టుకుని ఆయనకే వెన్నుపోటు పొడవకూడదు రా అని సినిమాలో విశాల్ చెప్పిన డైలాగ్ చర్చనీయాంశంగా మారింది. (vishal)