Vishal Punjabi: ఆ స్టార్ హీరో వేరే హీరోయిన్‌తో సెక్స్ చేస్తూ దొరికిపోయాడు

Vishal Punjabi says he saw a big hero naked with another heroine

Vishal Punjabi: పెళ్లైన రెండు నెల‌ల‌కే ఓ పెద్ద బాలీవుడ్ న‌టుడు మ‌రో హీరోయిన్‌తో కార‌వ్యాన్‌లో న‌గ్నంగా దొరికిపోయాడని షాకింగ్ వివ‌రాలు వెల్ల‌డించారు వెడ్డింగ్ ఫోటోగ్రాఫ‌ర్, ద‌ర్శ‌కుడు విశాల్ పంజాబీ. అత‌ను బాలీవుడ్‌లో పెద్ద న‌టుడ‌ని.. అత‌ను మ‌రో హీరోయిన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకోవాల‌నుకున్నాడ‌ని అన్నాడు. పెళ్లి స‌మ‌యంలో త‌న‌ను వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్‌గా బుక్ చేసుకున్నాడ‌ని బాగానే డ‌బ్బులు ఇస్తాన‌ని చెప్పాడ‌ని తెలిపారు.

“” అత‌ను పెద్ద హీరో. హీరోయిన్ కూడా పాపుల‌రే. న‌న్ను వెడ్డింగ్ ఫోటోగ్రాఫ‌ర్‌గా బుక్ చేసుకున్నారు. నేను నా నైపుణ్యాల‌న్నీ ఉప‌యోగించి చాలా అందంగా పెళ్లంతా చిత్రీక‌రించాను. పెళ్లైన రెండు నెల‌ల త‌ర్వాత ఫుటేజ్ రెడీ అయింద‌ని హీరోకి ఫోన్ చేసా. అత‌ను కాల్ లిఫ్ట్ చేయ‌డం లేదు. స‌రే అని హీరోయిన్‌కి చేసా. ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి నాకు వెడ్డింగ్ వీడియో వ‌ద్దు ఏమొద్దు అని ఏడ్చింది.

నాకేమీ అర్థంకాలేదు. దాంతో నేను మేనేజ‌ర్‌కు చేసా. అప్పుడు అత‌ను జ‌రిగిన విష‌యం చెప్పారు. హీరో పెళ్లైన రెండు నెల‌ల‌కే మ‌రో హీరోయిన్‌తో త‌న కారావాన్‌లో సెక్స్ చేస్తూ భార్య‌కు దొరికిపోయాడు. దాంతో ఇక వెడ్డింగ్ వీడియో వ‌ద్దు అని చెప్పేసారు. నా బాధ ఏంటంటే.. నేను వీడియోను చిత్రీక‌రించ‌డానికి ముందు 50 శాతం డ‌బ్బు వీడియో ఇచ్చాక మిగ‌తా 50 శాతం డ‌బ్బు తీసుకుంటాన‌ని చెప్పాను. నాకు 50 శాతం డ‌బ్బు రాలేదు. దాంతో ఆ ప‌రిస్థితుల్లో వాళ్ల‌ను నేను అడ‌గ‌లేక‌పోయాను. ఇప్ప‌టికీ ఆ వీడియో నా ద‌గ్గ‌ర ఉంది.

నేను దానిని నెట్‌ఫ్లిక్స్‌కి అమ్ముకుంటే ఎన్ని కోట్లైనా ఇస్తారు. కానీ మ‌నం అలా చేయ‌లేం క‌దా. నాకు ఇప్ప‌టికీ అర్థంకాని విష‌యం ఏంటంటే.. పెళ్లి స‌మ‌యంలో ఆ హీరో హీరోయిన్ చెయ్యి పట్టుకుని ఎంతో భావోద్వేగానికి గుర‌య్యాడు. అబ్బో ఎంత ప్రేమ ఉందో అని అనుకున్నాను “” అని తెలిపారు.