Vishal చేసుకోబోయేది ఈమెనేనా?
Hyderabad: ప్రముఖ నటుడు విశాల్ (vishal) పెళ్లి గురించి ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు ఆయన వరలక్ష్మి శరత్ కుమార్‌తో (varalakshmi sarathkumar) రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ తర్వాత వరలక్మి తండ్రి శరత్ కుమార్‌తో విశాల్‌కు రాజకీయపరంగా గొడవలు జరిగాయి. దాంతో విశాల్, వరలక్ష్మి విడిపోయారు. ఆ తర్వాత విశాల్ (vishal) స్వయంగా తన పెళ్లి గురించి ప్రకటించారు. అర్జున్ రెడ్డిలో (arjun reddy) చిన్న క్యారెక్టర్లో నటించిన అనీషాతో (anisha) విశాల్ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది.
కానీ విశాల్ మాత్రం నడిగర్ సంఘానికి ఒక బిల్డింగ్ కట్టాకే పెళ్లి చేసుకుంటానని అనడంతో అనీషాతో కూడా బ్రేకప్ అయిపోయింది. ఇప్పుడు ముచ్చటగా వినిపిస్తున్న మూడో రూమర్ ఏంటంటే..ప్రముఖ నటి లక్ష్మీ మేనన్‌తో (lakshmi menon) విశాల్ పెళ్లి జరగనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. 2013లో వచ్చిన పాండియనాడు (pandiya naadu) అనే సినిమాలో విశాల్, లక్ష్మి మేనన్ (lakshmi menon) కలిసి నటించారు. ఇప్పుడు విశాల్ (vishal) ఆమెతోనే డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది.