Virupaksha: థియేట‌ర్‌లో డైరెక్ట‌ర్ ఫోన్ దోపిడీ!

Hyderabad: సుప్రీం హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్(sai dharam tej) న‌టించిన విరూపాక్ష(virupaksha) సినిమా రిలీజ్ రోజే బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం అందుకుంది. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల‌తో పాటు అటు ఓవ‌ర్‌సీస్‌లోనూ మంచి వ‌సూళ్లు రాబడుతోంది. కార్తిక్ దండు(kartik dandu) ఈ సినిమాకు డైరెక్ట‌ర్‌. అయితే రెండో రోజు థియేట‌ర్ల ద‌గ్గ‌ర రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దామ‌ని కార్తిక్ ఓ థియేట‌ర్‌కి వెళ్లాడ‌ట‌. తిరిగి వ‌చ్చి చూసుకునే స‌రికి ఫోన్ కొట్టేసార‌ట‌. అయితే ఆయ‌న ఏ థియేట‌ర్‌కు వెళ్లాడ‌న్న విష‌యం మాత్రం తెలియ‌రాలేదు. ఇక సినిమా విష‌యానికొస్తే..ఇందులో సంయుక్త(samyukta) హీరోయిన్‌గా యాక్ట్ చేసారు. ఆమె ఇప్ప‌టివ‌ర‌కు న‌టించిన అన్ని తెలుగు సినిమాలు వ‌రుస‌గా హిట్స్ అందుకున్నాయి. దాంతో గోల్డెన్ గ‌ర్ల్ అనే టైటిల్ కొట్టేసారు. ఈ సినిమాలో ఆమె నందిని క్యారెక్ట‌ర్‌లో న‌టించారు. ఆ క్యారెక్ట‌ర్ మరే హీరోయిన్‌కి వ‌చ్చినా సంయుక్త‌లా మాత్రం యాక్ట్ చేయ‌లేర‌ని ఫ్యాన్స్ ఆకాశానికెత్తేస్తున్నారు.